శతమానంభవతి మోషన్ పోస్టర్ రిలీజ్..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శతమానంభవతి. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను ఈరోజు రిలీజ్ చేసారు. సరిగ్గా పదేళ్ల క్రితం అంటే ఆగష్టు 9 2006లో బొమ్మరిల్లు చిత్రం రిలీజ్ అయ్యింది. ఫాదర్ - సన్ రిలేషన్ కధాంశంగా బొమ్మరిల్లు చిత్రం రూపొందిన విషయం తెలిసిందే.
ఇప్పుడు 2016లో గ్రాండ్ ఫాదర్ - గ్రాండ్ సన్ రిలేషన్ పై శతమానంభవతి అనే చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండడం విశేషం. బంధాలు - అనుబంధాల ప్రాముఖ్యతను నేటితరానికి తెలియచెప్పే విభిన్న కథాంశంతో రూపొందుతున్న శతమానంభవతి చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బొమ్మరిల్లు వలే శతమానంభవతి చిత్రం కూడా ఫ్యామిలీ ఆడియోన్స్ ను ఆకట్టుకుని మంచి చిత్రంగా నిలుస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments