ఓవర్ సీస్ లో విశేషంగా ఆకట్టుకుంటున్న శతమానం భవతి..!

  • IndiaGlitz, [Monday,January 16 2017]

శ‌ర్వానంద్, అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ శ‌త‌మానం భ‌వ‌తి. ఈ చిత్రాన్ని వేగేశ్న స‌తీష్ తెర‌కెక్కించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా శ‌త‌మానం భ‌వ‌తి ఈనెల 14న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. సంక్రాంతికి ఫ్యామిలీ అంతా క‌లిసి చూసే చిత్రంగా రూపొందిన శ‌త‌మానం భ‌వ‌తి మూవీకి ఓవ‌ర్ సీస్ లో విశేషాద‌ర‌ణ ల‌భిస్తుంది. మ‌న ప‌ల్లెటూరు వాతావ‌ర‌ణాన్ని తెర పై ఆవిష్క‌రించ‌డం, బంధాలు, అనుబంధాలు నేప‌ధ్యంతో ఈ సినిమాతో తెర‌కెక్క‌డంతో ఓవ‌ర్ సీస్ ఆడియోన్స్ కు బాగా న‌చ్చింది. దీంతో ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ క‌లిగిస్తుందీ చిత్రం. అక్క‌డ‌ ఫ‌స్ట్ డే దాదాపు 3 కోట్లు వ‌సూలు చేసింది.

More News

జనవరి 20న లారెన్స్ 'శివలింగ' ఆడియో విడుదల

కొరియోగ్రాపర్, డైరెక్టర్, హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై శివలింగ ను తెరకెక్కిస్తున్న చిత్రం 'శివలింగ'.రితిక హీరోయిన్గా నటిస్తుంది.

1 మిలియన్ మార్క్ ను అందుకుంటున్న శాతకర్ణి..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. జాగర్లమూడి క్రిష్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించారు.

2 మిలియన్ దిశగా ఖైదీ నెం 150..!

మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత నటించిన ఖైదీ నెం 150 చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ చిత్రం ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 47 కోట్ల 7 లక్షలు వసూలు చేసిందని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇడియట్, ఆర్య సూపర్ హిట్ అయినట్లే 'నేను లోకల్' సూపర్ హిట్ అవుతుంది - దిల్ రాజు

నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు సమర్పణలో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నేను లోకల్`.

'గౌతమిపుత్ర శాతకర్ణి' ఫస్ట్ డే కలెక్షన్స్

నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం, ప్రతిష్టాత్మకంగా క్రిష్ తెరకెక్కించిన సినిమా `గౌతమిపుత్ర శాతకర్ణి`. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రం వరల్డ్వైడ్ గా మంచి ప్రశంసలు అందుకుంది.