ఆఖ‌రి షెడ్యూల్ లో  హిమాల‌య స్టూడియో మేన్ష‌న్స్  ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం

  • IndiaGlitz, [Saturday,January 09 2021]

హిమాల‌య స్టూడియో మేన్ష‌న్స్ ప‌తాకంపై రోన‌క్ కాటుకూరి, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ ద‌ర్శ‌క‌త్వంలో పి.ఉద‌య్ కిర‌ణ్ నిర్మిస్తోన్న ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని నాలుగో షెడ్యూల్ జ‌రుపుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత పి.ఉద‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ...''ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న మా చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్, క‌ర్నూలు, వికారాబాద్, ప‌రిస‌ర ప్రాంతాల్లో మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇటీవ‌ల హైద‌రాబాద్ లోని సార‌థి స్టూడియోలో హీరోయిన్ ఇంటికి సంబంధించి వేసిన సెట్లో ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించాము. నాలుగో షెడ్యూల్ ను ఈ నెల‌లో హైద‌రాబాద్ లో జ‌ర‌ప‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ అంతా పూర్త‌వుతుంది. పాట‌ల చిత్రీక‌ర‌ణ ఫిబ్ర‌వ‌రిలో ఫారిన్ లో చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం మా సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ. వ‌చ్చే నెల‌లో టైటిల్ లోగోతో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేస్తాము'' అన్నారు.

శ‌శాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, హేమ‌, ర‌ఘు, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ; సాహిత్యం: సురేష్ గంగుల, దేవ్; ఎడిటింగ్ః ఉపేంద్ర‌; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః రామాంజ‌నేయులు; సినిమాటోగ్ర‌ఫీః అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి; నిర్మాతః పి.ఉద‌య్ కిర‌ణ్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః సురేష్‌.

More News

మహేష్‌కి వదినగా నటిస్తున్నారనే వార్తపై రేణు దేశాయ్ క్లారిటీ..

ప్రముఖ నటి రేణూ దేశాయ్.. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా బిజీ అవుతూ వస్తున్నారు. ఇటీవలే ఆమె వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు

దేశంలో విజృంభిస్తున్న బర్డ్‌ఫ్లూ.. తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటంటే..

దేశంలో బర్డ్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రతాపాన్ని చూపిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది.

మస్క్ ట్వీట్ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే..

ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ ఒక్క ట్వీట్‌తో రేపిన దుమారం అంతా ఇంతా కాదు.

థియేట‌ర్స్ ఆక్యుపెన్సీ.. కేంద్రానికి లేఖ రాసిన ఎఫ్ఎఫ్ఐ

పండ‌గ‌లు వ‌చ్చేస్తున్నాయి. కానీ కోవిడ్ ప్ర‌భావం నుండి థియేట‌ర్స్‌కు ఇంకా విముక్తి దొర‌క‌డం లేదు.

మ‌రో ఇతిహాసంపై త్రివిక్ర‌మ్ క‌న్ను...!

మాట‌ల ర‌చ‌యిత‌గా త‌న మార్కు చూపించుకుని డైరెక్ట‌ర్‌గా టాప్ రేంజ్‌కి ఎదిగిన వ్య‌క్తి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌.