ఆఖరి షెడ్యూల్ లో హిమాలయ స్టూడియో మేన్షన్స్ ప్రొడక్షన్ నెం-1 చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
హిమాలయ స్టూడియో మేన్షన్స్ పతాకంపై రోనక్ కాటుకూరి, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ దర్శకత్వంలో పి.ఉదయ్ కిరణ్ నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెం-1 చిత్రం మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని నాలుగో షెడ్యూల్ జరుపుకోవడానికి సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత పి.ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ...``లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న మా చిత్రం ఇప్పటి వరకు హైదరాబాద్, కర్నూలు, వికారాబాద్, పరిసర ప్రాంతాల్లో మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇటీవల హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో హీరోయిన్ ఇంటికి సంబంధించి వేసిన సెట్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాము. నాలుగో షెడ్యూల్ ను ఈ నెలలో హైదరాబాద్ లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ అంతా పూర్తవుతుంది. పాటల చిత్రీకరణ ఫిబ్రవరిలో ఫారిన్ లో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం మా సినిమాకు అదనపు ఆకర్షణ. వచ్చే నెలలో టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తాము`` అన్నారు.
శశాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, హేమ, రఘు, తాగుబోతు రమేష్, అనంత్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ; సాహిత్యం: సురేష్ గంగుల, దేవ్; ఎడిటింగ్ః ఉపేంద్ర; ఆర్ట్ డైరక్టర్ః రామాంజనేయులు; సినిమాటోగ్రఫీః అజిత్ వి.రెడ్డి, జయపాల్ రెడ్డి; నిర్మాతః పి.ఉదయ్ కిరణ్, రచన-దర్శకత్వంః సురేష్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com