మారుతితో జతకడుతున్న శర్వా...
Send us your feedback to audioarticles@vaarta.com
రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్‌రాజా, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రాలతో సక్సెస్ మీదున్న శర్వానంద్ ఇప్పుడు దిల్‌రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శతమానం భవతి చిత్రంలో నటిస్తున్నాడు. కథలో ఎంపిక కడు జాగ్రత్తగా ఉంటున్న ఈ యంగ్ హీరోతో సినిమా చేయాలని మారుతి ప్రయత్నం చేస్తున్నాడట. బాబు బంగారం తర్వాత మారుతి వెంటనే సినిమా స్టార్ట్ చేయకుండా స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడట. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కాన్సెప్ట్‌ను శర్వానంద్‌తో చేయడానికి మారుతి ఆసక్తిగా ఉన్నాడని టాక్. మరి శర్వానంద్ ఇప్పుడిప్పుడే సక్సెస్‌ల జోరులో ఉన్నాడు. ఏదీ అంత సులువుగా ఒప్పుకోవడం లేదు. మరి మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com