మరో ప్లాప్ డైరెక్టర్‌తో శర్వా
Send us your feedback to audioarticles@vaarta.com
'లై' సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే హీరో శర్వానంద్ దర్శకుడిపై నమ్మకంతో సినిమా చేయడానికి సిద్ధమై.. 'పడిపడిలేచెమనసు' సినిమా చేశాడు. ఈ సినిమాకు డిజాస్టర్ అయ్యింది.
నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇప్పుడు శర్వానంద్ అలాంటి రిస్కీ స్టెప్నే తీసుకోబోతున్నాడు. మరో ప్లాప్ డైరెక్టర్‌తో పనిచేయబోతున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. చందు మొండేటి.
గత ఏడాది సవ్యసాచి సినిమా చేసిన చందు మొండేటిని విజయం వెక్కిరించింది. దీంతో ఢీలా పడ్డ ఆ దర్శకుడు రీసెంట్గా శర్వానంద్‌ను కలిసి ఓ కథ వినిపించాడట.
శర్వాకు కథ నచ్చింది. ప్రస్తుతం 'దళపతి' (వినపడుతున్న టైటిల్) తర్వాత తమిళ చిత్రం '96' తెలుగు రీమేక్‌లో శర్వానంద్ నటించబోతున్నాడు. దాని తర్వాతే చందు మొండేటి దర్శకత్వంలో శర్వానంద్ సినిమా ఉంటుందని సినీ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments