ఓ ఇంటివాడైన శర్వానంద్.. రక్షితా రెడ్డితో ఏడడుగులు వేసిన హీరో, జైపూర్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ ఓ ఇంటి వాడయ్యాడు. శనివారం రాత్రి రక్షితా రెడ్డి మెడలో ఆయన మూడు ముళ్లు వేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా శర్వా- రక్షితల వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల పెదద్లు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు ఇక్కడ పెళ్లి వేడుకలు జరిగాయి. శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, హీరో సిద్ధార్ధ్, హీరోయిన్ అదితిరావు హైదరీ, యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, విక్రమ్, దిల్‌రాజు కుటుంబం నుంచి ఆశిష్, హర్షిత్, హన్షీతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అటు సినీ ప్రముఖులు, అభిమానులు కొత్త జంటకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. పెళ్లి బట్టల్లో వున్న శర్వానంద్ - రక్షిత దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బంధువులు , సన్నిహితులు, ఇతర సినీ ప్రముఖుల కోసం జూన్ 9న శర్వానంద్ దంపతులు హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
మంచి కథలకే శర్వానంద్ ఓటు :
కాగా.. కథాబలం వున్న సినిమాలనే చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వా. ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకు మంచి ఫాలోయింగ్ వుంది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 18 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ అదే క్రమశిక్షణతో మెలుగుతారు శర్వా. ప్రస్థానం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, గమ్యం, శతమానం భవతి, మహానుభావుడు వంటి సినిమాలు ఆయనను నటుడిగా నిలబెట్టాయి. శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన గతేడాది ఒకే ఒక జీవితం చిత్రంతో మంచి హిట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేయనున్నారు.
ఎవరీ రక్షితా రెడ్డి :
కాగా.. రక్షితారెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వీరిది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ. రక్షిత తండ్రి ఏపీ హైకోర్ట్ న్యాయవాది కాగా.. ఆమె తాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాజీ మంత్రి, టీడీపీలో సీనియర్ నేత. ఇటీవలే ఆయన అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 26న శర్వానంద్-రక్షిత ఎంగేజ్మెంట్ నిరాడంబరంగా జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com