వినోదభరితమైన పోలీస్ పాత్రలో శర్వానంద్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సీనియర్ నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై వరుస విజయాలతో సోలో హీరో గా స్టార్డమ్ సంపాదించుకున్న శర్వానంద్ తో ఆయన 25వ సినిమా ని నిర్మిస్తున్నారు . విన్నూత్నమైన కథల తో, మంచి నటన తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న శర్వానంద్, ఇంతకుముందు ఎన్నడూ చేయని ఒక వినోదభరితమైన పోలీస్ పాత్రలో ఈ చిత్రం లో కనిపిస్తారు.
శర్వ సరసన లావణ్యా త్రిపాఠి హీరోయిన్ గా కనిపించే ఈ చిత్రానికి నూతన దర్శకుడు చంద్రమోహన్ పని చేస్తున్నారు. అయన గతం లో కరుణాకరన్ వద్ద పని చేసిన టెక్నీషియన్. ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయిన ఈ చిత్రం విజయవంతం గా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ ఈ నెల 15 నుండి ప్రారంభం అవుతుంది.
నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ, " పూర్తి వినోదాత్మకం గా ఈ చిత్రం ఉంటుంది. నూతన దర్శకుడు చంద్రమోహన్ చెప్పిన కథ బాగుంది. రొమాన్స్, కామెడీ , ఏక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది ", అని అన్నారు.
ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. టైటిల్ ను ,ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలుపుతాం అని, ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు గా చిత్ర బృందం తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments