శర్వాతో షాలిని?
Send us your feedback to audioarticles@vaarta.com
అర్జున్‌రెడ్డితో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ షాలిని పాండే. ప్రీతి పాత్రలో క్యూట్‌గా కనిపించి ఆకట్టుకోవడమే కాకుండా.. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని మరీ మెప్పించింది.
అర్జున్ రెడ్డి సంచలన విజయంతో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ గా నిలిచిన షాలిని.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే మహానటి చిత్రంతో ఓ కీలక పాత్రకు ఎంపికైన ఈ అమ్మడు.. మరోవైపు తమిళంలో 100 % కాదల్ సినిమా చేస్తోంది. తెలుగులో విజయం సాధించిన 100% లవ్‌కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కథానాయకుడు.
ఇదిలా ఉంటే.. శర్వానంద్ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ రూపొందించే చిత్రంలో షాలిని ఓ హీరోయిన్గా ఎంపికైందని వార్తలు వినిపిస్తున్నాయి. తొలిసారిగా శర్వా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ థ్రిల్లర్ చిత్రంలో ఇప్పటికే నివేదా థామస్ మెయిన్ హీరోయిన్గా ఎంపికైందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com