శర్వాతో షాలిని?

  • IndiaGlitz, [Monday,October 16 2017]

అర్జున్‌రెడ్డితో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది భామ షాలిని పాండే. ప్రీతి పాత్ర‌లో క్యూట్‌గా క‌నిపించి ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా.. త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ చెప్పుకుని మ‌రీ మెప్పించింది.

అర్జున్ రెడ్డి సంచ‌ల‌న విజ‌యంతో టాక్ ఆఫ్ ఇండ‌స్ట్రీ గా నిలిచిన షాలిని.. ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉంది. ఇప్ప‌టికే మ‌హాన‌టి చిత్రంతో ఓ కీల‌క పాత్ర‌కు ఎంపికైన ఈ అమ్మ‌డు.. మ‌రోవైపు త‌మిళంలో 100 % కాద‌ల్ సినిమా చేస్తోంది. తెలుగులో విజ‌యం సాధించిన 100% ల‌వ్‌కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్ర‌కాష్ క‌థానాయ‌కుడు.

ఇదిలా ఉంటే.. శ‌ర్వానంద్ హీరోగా ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ రూపొందించే చిత్రంలో షాలిని ఓ హీరోయిన్‌గా ఎంపికైంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. తొలిసారిగా శ‌ర్వా ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ థ్రిల్ల‌ర్ చిత్రంలో ఇప్ప‌టికే నివేదా థామ‌స్‌ మెయిన్ హీరోయిన్‌గా ఎంపికైంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడుతుంది.

More News

'పిఎస్‌వి గ‌రుడవేగ 126.18ఎం' థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌

యాంగ్రీ యంగ్ మేన్‌గా, ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో డా.రాజ‌శేఖ‌ర్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'.

థ‌మ‌న్ కి మ‌ళ్లీ మంచి రోజులు

ఒక టైంలో యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ హ‌వా బాగానే సాగింది. అయితే ఇటీవ‌ల కాలంలో ఒక‌టీఅరా మిన‌హాయిస్తే థ‌మ‌న్ కెరీర్‌కి ప్ల‌స్ అయిన సినిమాలు లేవు. ఇక థ‌మ‌న్ ప‌ని అయిపోయింది అని అనుకుంటున్న త‌రుణంలో వ‌రుస‌గా రెండు విజ‌యాల‌తో వార్త‌ల్లో నిలిచాడు థ‌మ‌న్‌.

స‌మ‌ర‌సింహారెడ్డి తేదిన వ‌స్తున్న బాల‌య్య‌

నటసింహ నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో స‌మ‌ర‌సింహారెడ్డి ఒక‌టి. ఫ్యాక్ష‌న్ చిత్రాల ట్రెండ్ ఈ చిత్రంతో ఊపందుకుంది. 1999లో జ‌న‌వ‌రి 13న సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ సినిమా గ‌త రికార్డుల‌ను తిర‌గ‌రాసి చ‌రిత్ర సృష్టించింది అప్ప‌ట్లో.

రామ్ ద‌ర్శ‌కుడితో నాని?

నేను శైల‌జ చిత్రంతో తెలుగు ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌. ప్ర‌స్తుతం అదే చిత్ర క‌థానాయ‌కుడు రామ్‌తో ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

గోపీచంద్‌తో మ‌రోసారి..

పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, సుప్రీమ్ చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ క‌థానాయ‌కుడు అనిపించుకున్నాడు  మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌. అయితే, ఆ త‌రువాత వ‌చ్చిన తిక్క‌, విన్న‌ర్‌, న‌క్ష‌త్రం ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.