చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లి పీటలెక్కనున్న శర్వానంద్!

  • IndiaGlitz, [Tuesday,August 25 2020]

వైవిధ్యభరితమైన కథను ఎంచుకుంటూ ప్రతి సినిమానూ సక్సెస్ బాట పట్టించుకోవడంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ దిట్ట. ఈ హీరో త్వరలోనే తన చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడని సమాచారం. శర్వాకు కాబోయే భార్య ప్రస్తుతం పారిశ్రామికవేత్తగా రాణిస్తోందని తెలుస్తోంది. చిన్నతనం నుంచి కొనసాగుతున్న వీరి స్నేహం కొద్ది కాలం క్రితమే ప్రేమగా మారిందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

శర్వా ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలిపారని సమాచారం. ఇటీవలే ఇరువురూ తమ ప్రేమ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలిపి అంగీకారం తీసుకున్నారని టాక్ నడుస్తోంది. త్వరలోనే నిశ్చితార్థం కార్యక్రమం నిర్వహించి.. ఆపై పెళ్లికి కూడా ముహూర్తం ఫిక్స్ చేస్తారని సమాచారం. శర్వా పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందనే వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే శర్వా కానీ అటు తన స్నేహితురాలు కానీ ఈ వార్తలపై ఇప్పటి వరకూ స్పందించలేదు.

కరోనాకు ముందు అడపా దడపా జరిగే పెళ్లిళ్లు ప్రస్తుతం వరుసగా జరిగిపోతున్నాయి. యంగ్ హీరోలంతా వరుస పెట్టి రోజుల వ్యవధిలోనే పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. నిఖిల్, నితిన్, రానా తదితరులంతా ఈ కరోనా సమయంలోనే పెళ్లిళ్లు చేసుకున్నారు. మెగా డాటర్ నిహారిక కూడా ఇటీవలే సింపుల్‌గా నిశ్చితార్థం జరుపుకుని పెళ్లికి సిద్ధమవుతోంది. అయితే పెళ్లి కూడా కరోనా కారణంగా సింపుల్‌గా నిర్వహించాలని మెగా ఫ్యామిలీ భావిస్తోంది. అన్నీ ఓకే అయితే నిహారిక తరువాత పెళ్లి శర్వానంద్‌దే అవుతుందేమో చూడాలి.

More News

ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధంపై కోర్టును ఆశ్రయించిన టిక్‌టాక్..

అమెరికా.. సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ సంస్థ నిర్వాహకుల మధ్య వివాదం ముదురుతోంది. సోమవారం టిక్‌టాక్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

చైత‌న్య‌కు త‌ప్ప‌డం లేదా!!

హీరోలు కొన్ని ప్రాజెక్టులు చేయ‌కూడ‌ద‌ని అనుకున్నా కూడా.. డైరెక్ట‌ర్, స్క్రీన్‌ప్లే న‌చ్చితే చేయాల్సి వ‌స్తుంది.

నిర్మాత‌కు డ‌బ్బులు వెన‌క్కిచ్చేసిన గోపీచంద్‌?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీంచ‌ద్ ఇప్పుడు సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్‌’ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్‌ను ప్రారంభించిన భారత్

ఇండియాలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు

నాన్నగారిని కలిశాను.. నన్ను గుర్తుపట్టి మాట్లాడారు: ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కాస్త కోలుకుంటున్నారని తెలుస్తోంది.