బాలయ్యతో ఢీ కొడుతున్న శర్వానంద్..
Send us your feedback to audioarticles@vaarta.com
రన్ రాజా రన్, ఇది మళ్ళీ మళ్ళీ రాని రోజు చిత్రాలతో వరుస విజయాలు సాధించిన యంగ్ హీరో శర్వానంద్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ డైరెక్టర్ మేర్లపాక గాంథీ దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్నతాజా చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ పతాకం పై ప్రమోద్ ఉప్పలపాటి, వంశీక్రిష్ణా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇటీవల రిలీజ్ చేసిన ఎక్స్ ప్రెస్ రాజా టీజర్ కి మంచి రెస్సాన్స్ లభిస్తోంది. శర్వానంద్ సరసన సురభి నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఎక్స్ ప్రెస్ రాజా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఎక్స్ ప్రెస్ రాజాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతికి బాలయ్య డిక్టేటర్, నాగ్ సొగ్గాడే చిన్ని నాయనా రిలీజ్ చేస్తున్నారు. మరి..సీనియర్ హీరోలతో పోటీపడుతున్న యువ హీరో శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజాతో హ్యాట్రిక్ సాధిస్తాడో..లేదో..చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments