మహాసముద్రం కి గుమ్మడికాయ కొట్టేసాము థియేటర్ కి రమంటున్న సర్వ - సిద్ధార్థ్

శర్వానంద్, సిద్దార్థ్ కలసి నటిస్తున్న 'మహాసముద్రం'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది విడుదల కాబోతున్న క్రేజీ చిత్రాలలో మహా సముద్రం కూడా ఒకటి. ఆర్ఎక్స్ 100 చిత్రంతో ప్రతిభ గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి.. మరో అద్భుతమైన కథతో ప్రేక్షకులని ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్ళబోతున్నాడు.

అజయ్ భూపతి దర్శకత్వంలోనే 'మహా సముద్రం' చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా చిత్ర యూనిట్ మహా సముద్రం అప్డేట్ అందించింది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయిపోయింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందట. దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రంలో ప్రతి పాత్రని ఓ మాస్టర్ పీస్ గా రచించి తెరకెక్కించారట. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటించగా.. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు.

ఈ చిత్రంలో సపోర్ట్ కాస్ట్ కూడా చాలా బలంగా ఉంది. రావు రమేష్, జగపతి బాబు, గరుడ రామ్ లాంటి నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. కీలక నటీనటుల ఫస్ట్ లుక్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. టీజర్ లాంటి ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయకపోయినా మహా సముద్రం క్రేజ్ ఆడియన్స్ లో పెరుగుతోంది.

గత కొన్ని రోజులుగా ప్రధాన పాత్ర దారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఎట్టకేలకు షూటింగ్ మొత్తం ఫినిష్ అయింది. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ త్వరలోనే ప్రారంభించనున్నారు. సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం చేతన్ భరద్వాజ్ అందిస్తున్నారు.