బరువు తగ్గిన శర్వానంద్
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ రొమాంటిక్ లవ్ స్టొరీని, క్రేజీ కాంబినేషన్‌తో ఒక యూత్‌ఫుల్ డైరెక్టర్ తెరకెక్కిస్తే ఎలా వుంటుంది? దానికి సమాధానం.. పడి పడి లేచే మనసు` (పరిశీలనలో ఉన్న పేరు) సినిమాలా ఉంటుందనే చెప్పాలి. ఆ క్రేజీ కాంబినేషన్.. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోహీరోయిన్లు శర్వానంద్, సాయిపల్లవి కాగా.. ఆ రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్న యూత్‌ఫుల్ దర్శకుడు.. అందాల రాక్షసి`, కృష్ణగాడి వీరప్రేమగాధ` వంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ టేకాఫ్ చేసిన హను రాఘవపూడి.
ఈ ఆసక్తికరమైన కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ రొమాంటిక్ లవ్ స్టొరీ.. తాజాగా కోల్‌కతాలో చిత్రీకరణ ప్రారంభించుకుంది. ప్రస్తుతం అక్కడ ప్రధాన పాత్రలపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం శర్వానంద్ 10 కేజీల బరువు కూడా తగ్గారని సమాచారం. ఆర్మీ నేపథ్యంలో సాగే చిత్రం కావడం వలన డిఫరెంట్ లుక్ కోసం శర్వానంద్ ప్రయత్నిస్తున్నారని.. అలాగే తన హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com