అలా అనుకుంటే టూ మచ్ అవుతుంది - శర్వానంద్

  • IndiaGlitz, [Thursday,May 11 2017]

'రన్‌ రాజా రన్‌', 'మళ్ళీ మళ్ళీ ఇదిరానిరోజు', 'ఎక్స్‌ప్రెస్‌ రాజా', 'శతమానంభవతి' వంటి విజయాలను బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతున్న యువ కథానాయకుడు శర్వానంద్‌ హీరోగా ఛత్రపతి, 'అత్తారింటికి దారేది' బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించి భారీ నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై డెబ్యూ డైరెక్టర్‌ చంద్రమోహన్‌ దర్శకత్వలో వల్లీ బాపినీడు నిర్మాతగా రూపొందిన అవుటండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ 'రాధ'. ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది.

ఈ సందర్భంగా హీరో శర్వానంద్‌తో ఇంటర్వ్యూ...

'రాధ' సినిమాను అంగీకరించడానికి కారణం..?

'రాధ' సినిమా కథ కొత్తది అని చెప్పను, రొటీన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. అయితే నా క్యారెక్టరైజేషన్‌ విన్నప్పుడు డైరెక్టర్‌ దాన్ని చేసిన ట్రీట్‌మెంట్‌ నాకు కొత్తగా అనిపించడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. జనరల్‌గా మనం ఏ ఆపదలో ఉన్నా ఆదుకుంటానని కృష్ణుడు అనడం సినిమాల్లో చూసుంటాం. అలాగే పోలీస్‌ అనేవాడు కూడా అంతే ఇప్పుడు మనకు ఏదైనా కష్టమోస్తే ఆదుకునే ఏకైక డిపార్ట్‌మెంట్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌. కొందరికి పోలీస్‌ అంటే చిన్న చూపు ఉంటుంది, కానీ ఎండనక, వాననక ప్రజలకు అండగా నిలబడే డిపార్ట్‌మెంట్‌ పోలీసులే. అందుకనే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు ట్రిబ్యూట్‌ రాధ సినిమా చేశాం. పోలీసులు ప్రజలకు ఎలా సపోర్ట్‌ చేస్తారనే దాన్ని ఎంటర్‌టైనింగ్‌ పంథాలో చెప్పాం.

రాధ..పోలీసు కథ అనగానే మీకేమనిపించింది?

పోలీస్‌ స్టోరీ అనగానే పేజీ పేజీల డైలాగ్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉంటాయని కాకుండా కృష్ణుడు ఎలిమెంట్‌ను కథలోకి తీసుకొచ్చి డైరెక్టర్‌ కథను రాసుకున్నాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి అప్పట్లో కృష్ణుడు పుట్టాడు. ఇప్పుడు పోలీసోడు పుట్టాడు. అని హీరో ఫీలవుతుంటాడు. తన చుట్టు పక్కల ఉండేవారిని అర్జునుడు, ద్వారపాలకులు అని కూడా పిలుస్తుంటాడు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను పాజిటివ్‌గా చూపించాం.

గబ్బర్‌ సింగ్‌లో పవన్‌ బాడీలాంగ్వేజ్‌లా అనిపిస్తుందే..?

అదేం లేదండి..పవన్‌కళ్యాణ్‌గారిలా అంటే టు మచ్‌ అయిపోతుంది. నా గత చిత్రాలు రన్‌ రాజా రన్‌, ఎక్స్‌ప్రెస్‌రాజా చిత్రాల్లో బాడీ లాంగ్వేజ్‌ కాకుండా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక నటుడిని ఇమిటేట్‌ చేయకూడదని నేను అనుకుంటాను. ఆ పాత్రలో శ్రీకృష్ణుడు అయితే ఎలా ఉంటుందోనని ఆలోచించుకున్నాను.

రాధ అనే క్యారెక్టర్‌ కృష్ణుడులా ఎందుకు భావిస్తాడు?

రాధకు చిన్నప్పట్నుంచి భగవద్గీత అంటే చాలా ఇష్టం. ఒకసారి రాధ అనే క్యారక్టర్‌ చిన్నతనంలో నడుచుకుంటూ వస్తుంది. వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు ఏం కావాలన్నా నేనుంటాను. నేను ఆపదల నుంచి రక్షిస్తాను అని భగవద్గీత వినపడుతుంటుంది. సరిగా ఆ సమయంలోనే అతను పక్కన ఎక్కడో కాలువలో పడబోతాడు. సమయానికి ఓ పోలీస్‌ వచ్చి కాపాడుతాడు. అంటే కృష్ణుడు పోలీస్‌ రూపంలో వచ్చి కాపాడాడు అని పిల్లాడికి మనసులో పడిపోతుంది. అప్పటి నుంచి కేక్‌ కటింగుల నుంచి, ఫ్యాన్సీ డ్రస్సుల నుంచి ఏదైనా 'రాధ'కు పోలీస్‌ డ్రస్సే.

మీరు స్పిరిచువల్‌ పర్సనా?

అవునండీ. నేను స్పిరిచువలే.

భగవద్గీత చదివారా?

చదివానండీ.. కాకపోతే మొత్తం కాదు. కొన్ని కొన్ని పార్టులు మాత్రం చదివాను.

మీరు సీరియస్‌ పాత్రలు చేశారు.. ఇప్పుడు ఎంటర్‌టైనింగ్‌ పాత్రలు చేశారు.. తేడా ఎలా ఉంది?

సీరియస్‌ పాత్రలు నన్ను నటుడిగా నిలబెట్టాయి. కానీ ఈ మధ్య చేస్తున్న ఎంటర్‌టైనింగ్‌ పాత్రలకు ప్రేక్షకుల నుంచి అమితమైన స్పందన వస్తోంది.

ప్రస్థానం తరహా చిత్రాలను మరలా చేయరా?

శతమానం భవతిలో నేను చేసింది ఆ తరహా పాత్రే. నా చుట్టూ ఉన్న వాళ్లు కామెడీ చేస్తుంటారు కానీ, నేను చేయను. వాళ్లందరితో పాటు ఫ్రేములో ఉంటానంతే. అలాంటి పాత్రలు చేసి చేసీ నాకే బోర్‌ వచ్చేసింది. సరదాగా చేస్తున్న ఈ సినిమాలు ఇప్పుడు బావున్నాయి.

పోలీస్‌ అనగానే మాస్‌ ఎలిమెంట్స్‌ని ప్రేక్షకులు ఆశిస్తారేమో..?

ఈ సినిమాలో మాస్‌ విషయాలు కూడా ఉంటాయి. కాకపోతే ఈ చిత్రంలో నా పేరు రాధాకృష్ణ. అందరూ రాధ అని పిలుస్తారు. హీరోయిన్‌ పేరు రాధ. ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా వస్తారని రాధ అనే టైటిల్‌ పెట్టాం. అలా టైటిల్‌ చాలా బాగా కుదిరింది.

'శతమానం భవతి'కన్నా ముందే ఈ సినిమాను మొదలుపెట్టినట్టున్నారు..?

అవునండీ. నిజమే. 'శతమానంభవతి'కన్నా ముందే ఈ సినిమాను మొదలుపెట్టాం. కాకపోతే ఆ సినిమా సంక్రాంతి అంశాలతో ఉండటం వల్ల సంక్రాంతికి విడుదలైతే మంచిదని రాజుగారు అనడంతో, వాళ్లూ వాళ్లూ మాట్లాడుకుని, ముందు ఆ సినిమా రిలీజ్‌ ప్లాన్‌ చేశాం. ఇప్పుడు రాధ సినిమా ముందుకొస్తోంది.

తమిళ సినిమాలకు వెళ్లే ఆలోచన గురించి చెప్పండి?

తమిళ చిత్రాలకు వెళ్లాలంటే ఎక్స్‌ ట్రార్డినరీ కథ అని అనిపించాలి. ఈ మద్యనే జర్నీ డైరక్టర్‌ శరవణన్‌ కూడా వచ్చి ఓ కథ చెప్పాడు. అంత ఎగ్జయిటింగ్‌గా అనిపించలేదు. ఆ మాటే అతనికి చెప్పా.

లావణ్యతో వర్క్‌ చేయడం ఎలా అనిపించింది?

సూపర్‌ అండీ. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. తిట్టినా నవ్వుతూనే ఉంటుంది.

మారుతి సినిమా ఎంత వరకు వచ్చింది?

ఒక షెడ్యూల్‌ పూర్తయింది.

సుధీర్‌తో సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి కదా?

సుధీర్‌తో సినిమా ఉంటుంది.. కానీ కథ బౌండెండ్‌ స్క్రిప్ట్‌గా రావాలి. బౌండ్‌ స్క్రిప్ట్‌ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. నిర్మాతకు కూడా చాలా బడ్జెట్‌ మిగులుతుంది.

ప్రొడక్సన్‌ చేస్తున్నారా?

లేదండీ. దానికి చాలా లెక్కలు తెలిసి ఉండాలి. టైమ్‌ పెట్టగలగాలి. డిస్ట్రిబ్యూషన్‌ వ్యవహారం తెలియాలి. అబ్బో చాలా ఉంటుంది. అవన్నీ అవగాహనలోకి వస్తేనే చేయాలి... లేకుంటే చేయకూడదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు యంగ్‌ హీరో శర్వానంద్‌.

More News

సింగర్ గా మారిన నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు గాయకుడిగా కొత్త అవతారం ఎత్తారు.

పవన్ సినిమాకు మరో టైటిల్ వినపడుతుంది...

పవర్స్టార్ పవన్కళ్యాణ్, స్టార్రైటర్ , డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చినబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

వచ్చిన వార్తలన్నీ అవాస్తవం - రానా

భళ్ళాల దేవగా మరోసారి తన అద్భుత నటనను ప్రదర్శించిన దగ్గుబాటి రానా ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో

కళా తపస్విని సత్కరించి, అభినందనలు తెలిపిన హీరో శ్రీకాంత్

కళా తపస్వి కె. విశ్వనాథ్ ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇప్పటికే ఆయన్ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రీమియర్ షోతో సూపర్ రెస్పాన్స్ అందుకున్న'వెంకటాపురం' సంతోషంలో యూనిట్ సభ్యులు

గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ మీద రాహూల్ మహిమా మక్వానా నటించగా శ్రేయాస్ శ్రీనివాస్ నిర్మించిన వెంకటాపురం సినిమా ఈనెల 12న విడుదల కాబోతుంది.