శర్వానంద్, సాయి పల్లవి.. 'విరాటపర్వం 1992?
Send us your feedback to audioarticles@vaarta.com
శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పడిపడి లేచె మనసు’. కలకత్తా నేపథ్యంలో రూపొందుతున్న ఈ ప్రేమకథా చిత్రంలో.. శర్వా, సాయి పల్లవి మధ్య సాగే సన్నివేశాలు యువతను అలరిస్తాయని చిత్ర బృందం పేర్కొంటోంది. అలాగే శర్వా, పల్లవి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరిందని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలకు ముందే శర్వానంద్, సాయి పల్లవి కాంబోలో మరో సినిమా పట్టాలెక్కనుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
‘నీదీ నాదీ ఒకే కథ’ దర్శకుడు వేణు ఊడుగుల డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి ‘విరాటపర్వం 1992’ అనే పేరుని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఆసక్తికరమైన కథ, కథనాలతో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయానికీ హత్తుకునేలా ఉంటాయని సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com