శర్వానంద్ అసలు కారణమేంటంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన అర్జున్‌రెడ్డి కల్ట్ మూవీగా సెన్సేషనల్ హిట్ సాధించింది. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ వంగాకు మంచి పేరు వచ్చింది. నిజానికి ఈ సినిమాను దర్శకుడు సందీప్ ముందుగా శర్వానంద్‌తోనే చేయాలనుకున్నాడు కానీ కొన్ని కారణాలతో కుదరలేదేనేది అందరికీ తెలిసిందే.
అయితే ఆ కారణాలేంటనే విషయాన్ని హీరో శర్వానంద్ పాత్రికేయులతో చెప్పాడు. కథ వినగానే కాస్తా రిస్కీ సబ్జెక్ట్ అనిపించి కథను అశ్వనీదత్, కేశినేని నాని వంటి నిర్మాతల దగ్గరకు పంపాడట. వాళ్లు కూడా రిస్క్ ఉందని చెప్పారట. దాంతో సందీప్ వంగానే తానే సినిమాను నిర్మిస్తానని అన్నాడట. దర్శకుడిపై నిర్మాణ బాధ్యతలు ఉండకూడదని భావించిన శర్వా, గతంలో తానే హీరో, నిర్మాతగా చేసిన సినిమా ఫలితం అనుకున్న స్థాయిలో రాకపోవడం తదితర అంశాలతో సినిమాను వదులుకన్నాడట. అదీ అసలు సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com