నా రెమ్యునరేషన్ నిర్మాతలే పెంచుతున్నారు - శర్వానంద్
Send us your feedback to audioarticles@vaarta.com
వెన్నెల`, గమ్యం`, ప్రస్థానం`,రన్ రాజా రన్`, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు`, ఎక్స్ ప్రెస్ రాజా` వంటి వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ లో దూసుకెళుతున్న హీరో శర్వానంద్ పుట్టినరోజు మార్చి 6. ఈ సందర్భంగా పాత్రికేయులతో శర్వానంద్ మాట్లాడుతూ
నేను పుట్టినరోజు ప్రత్యేక నిర్ణయాలేవీ తీసుకోను. నా ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ ఏడాది ఎక్స్ ప్రెస్ రాజా. సక్సెస్ తో హ్యపీగా ఉన్నాను. ఆ సినిమా సక్సెస్ తో నిర్మాతలు సహా అందరూ హ్యపీ అయ్యారు.
నాకు తెలుగులో అందరి దర్శకులతో పనిచేయాలనుంది. నా నెక్ట్స్ మూవీ ఇంకా కన్ పర్మ్ కాలేదు. ముగ్గురు దర్శకులు మూడు కథలను సిద్ధం చేస్తున్నారు. అందులో ఏదీ నచ్చితే ఆ సినిమా ముందు చేస్తాను. తర్వాత మిగిలిన ఇద్దరితో కూడా సినిమాలు చేస్తాను.
నేను మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించడం లేదు. కమర్షియల్ ఫార్మేట్ లో సినిమాలు చేయాలనుకుంటున్నాను. అలాగే పరిమిత బడ్జెట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే బడ్జెట్ లిమిట్ ఉంటేనే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ సహా అందరికీ మంచింది.
నిర్మాతగా నా ప్రొడక్షన్ లో ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. అలాగే తమిళంలో ఓ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అయితే ప్రస్తుతం నా దృష్టంతా తెలుగు సినిమాలపైనే ఉంటుంది.
మంచి కథలు కుదిరితే మల్టీస్టారర్ సినిమాలు, వెన్నెల తరహాలో నెగటివ్ రోల్స్ సినిమాలు చేయడానికి కూడా నేను సిద్ధమే.
తెలుగు, తమిళంతో కలుపుకుంటే నా నెక్ట్స్ మూవీ 25వ మూవీ అవుతుంది. అయితే ఇన్నేళ్ళ జర్నీ కారణం నా శ్రేయోభిలాషులే. చాలా హ్యపీగా ఉన్నాను. అయితే ఇందులో వెన్నెల, ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా ఇలా చాలా సినిమాలు నా మనసుకు మరీ దగ్గరైన సినిమాలు. అలాగే నా సరసన నటించిన హీరోయిన్స్ లో నిత్యామీనన్ ఎక్సలెంట్ ఫెర్ ఫార్మర్. నాతో సినిమా చేస్తున్న నిర్మాతలే నా రెమ్యునరేషన్ ను పెంచుతున్నారు.
చేరన్ దర్శకత్వంలో తమిళంలో చేసిన చిత్రాన్ని అక్కడ డివిడిల రూపంలో విడుదల చేశారు. ఇప్పుడు రాజాధిరాజా` పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నరు. నాకు ఆ సినిమాకు సంబంధం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments