శర్వానంద్ 'పడి పడి లేచే మనసు' ఫస్ట్ లుక్
Send us your feedback to audioarticles@vaarta.com
మోస్ట్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం "పడి పడి లేచే మనసు". శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్ సరసన సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా నేడు (మార్చి 6) విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి మాట్లాడుతూ.. "'పడి పడి లేచే మనసు' ఒక డిఫరెంట్ & క్రియేటివ్ లవ్ స్టోరీ. నేడు మా హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా మా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం కలకత్తాలో హీరో శర్వానంద్, హీరోయిన్ సాయిపల్లవి, మురళీశర్మల కాంబినేషన్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. వెంకట్ మాస్టర్ నేతృత్వంలో కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నాం. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, జయకృష్ణ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది" అన్నారు.
శర్వానంద్, సాయిపల్లవి, మురళీశర్మ, ప్రియారామన్, వెన్నెల కిషోర్, కళ్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి, ఫైట్స్: వెంకట్, అంబు-అరివ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఛాయాగ్రహణం" జయకృష్ణ గుమ్మడి, నిర్మాణం: శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి, దర్శకత్వం: హను రాఘవపూడి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com