ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ నుండి శర్వా బ‌య‌ట‌కు వ‌చ్చేశాడా?

  • IndiaGlitz, [Wednesday,July 18 2018]

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో పోషిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారని టాక్ విన‌ప‌డుతుంది ఇప్ప‌టికే ఈ సినిమాలో కొన్ని ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించేవారు దాదాపు ఫైన‌ల్ అయిన‌ట్లే.. బ‌స‌వ‌తారం పాత్ర‌లో విద్యాబాల‌న్‌, నారా చంద్ర‌బాబు నాయుడి పాత్ర‌లో రానా, ఎల్‌.వి.ప్ర‌సాద్ పాత్ర‌లో జిషు సేన్ గుప్తా, నాదెండ్ల భాస్క‌ర‌రావు స‌చిన్ ఖేడేక‌ర్‌, నిర్మాత నాగిరెడ్డి పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్ న‌టిస్తున్నారు. , ముర‌ళీ శ‌ర్మ‌, దేవీప్రసాద్‌, న‌రేశ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 9న విడుద‌ల చేయ‌నున్నారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోని ఈ సినిమా నుండి శ‌ర్వానంద్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడ‌ని టాక్. ఎందుకంటే.. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ యువ‌కుడిగా ఉన్న‌ప్పుడు పాత్ర‌లో శ‌ర్వానంద్‌ను న‌టింప‌చేయాల‌ని అనుకున్నార‌ట‌. అయితే ఆ పాత్ర‌లో ఇప్పుడు మోక్ష‌జ్ఞ న‌టిస్తాడ‌ని వార్త‌లు వినిప‌డుతున్నాయి. అదే కార‌ణంగా శ‌ర్వానంద్ బ‌య‌ట‌కు వ‌చ్చేసి ఉండొచ్చు.