నా సినిమా అని గ‌ర్వంగా చెప్పుకునేలా ఉంది: శ‌ర్వానంద్‌

  • IndiaGlitz, [Tuesday,December 25 2018]

శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం ప‌డి ప‌డి లేచె మ‌న‌సు.  టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 21న విడుద‌లైన ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి బ్ర‌హ్మాండ‌మైన స్పంద‌న ల‌భిస్తున్న‌ది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో చిత్ర బృందం పాత్రికేయుల స‌మావేశాన్ని నిర్వ‌హించింది.

న‌టుడు శ‌త్రు మాట్లాడుతూ మంచి సినిమాలో అవ‌కాశం ఇచ్చిన నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి, ద‌ర్శ‌కుడు హాను రాఘ‌వ‌పూడికి కృత‌జ్ఞ‌త‌లు. సినిమా చూసిన‌ప్పుడు శ‌ర్వానంద్ పోషించిన సూర్య పాత్రే క‌నిపించింది. ఆయ‌న న‌టించిన కొన్ని ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు చూస్తుంటే నాకు క‌న్నీళ్లొచ్చాయి. ఇప్ప‌టివ‌ర‌కు నేను చేసిన పాత్ర‌ల‌తో పోలిస్తే ఈ సినిమాలో క్యారెక్ట‌ర్‌లో  చాలా వేరియేష‌న్స్ ఉన్నాయి. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథతో పాటు చాలా సినిమాల్లో సీరియ‌స్ పాత్ర‌లు చేశాను.  ఇలాంటి క్యారెక్ట‌ర్స్ త‌ర్వాత డిఫ‌రెంట్‌గా ఓ కామెడీ పాత్ర చేయ‌డం ఆనందంగా ఉంది.  న‌టుల‌ను వైవిధ్య‌తంగా చూపించే ద‌ర్శ‌కులు అరుదుగా ఉంటారు.  హ‌ను రాఘ‌వ‌పూడి న‌న్ను కొత్తగా ఈ సినిమాలో చూపించారు అని తెలిపారు.

క‌ల్పిక మాట్లాడుతూ  బ్యూటిఫుల్ విజువ‌ల్స్‌, సెన్సిబుల్ సీన్స్‌తో కూడిన సినిమాలు త‌క్కువ‌గా వ‌స్తాయి. అలాంటి సినిమాల జాబితాలో ప‌డి ప‌డి లేచె మ‌న‌సు టాప్‌గా నిలుస్తుంది. మ్యూజిక‌ల్‌గా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సూర్య‌, వైశాలి  కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. ఇందులో శాలిని అనే డాక్ట‌ర్ పాత్ర చేశాను. తొలి ప్ర‌య‌త్నంలోనే నిర్మాత సుధాక‌ర్ పెద్ద విజ‌యాన్ని అందుకున్నారు. భ‌విష్య‌త్తులో ఆయ‌న మ‌రిన్ని స‌క్సెస్‌లు అందుకోవాలి.   కొత్త‌వాళ్ల‌ను ప్రోత్స‌హిస్తూ మంచి సినిమాలు తీయాలి అని చెప్పింది.

నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి మాట్లాడుతూ సినిమాను అంద‌రూ చ‌క్క‌గా ఆద‌రిస్తున్నారు అని తెలిపారు.

శ‌ర్వానంద్ మాట్లాడుతూ  సినిమా ఆంగీక‌రించే ముందు  ఓ గుర్తుండిపోయే మంచి సినిమా అవుతుంద‌ని న‌మ్మాను. ఇప్పుడు అదే  న‌మ్మ‌కంతో ఉన్నాం. ఆల్బ‌మ్‌లో ప‌డి ప‌డి లేచే మ‌న‌సు నా సినిమా అని గ‌ర్వంగా చెప్పుకునేలా ఉంటుంది. చాలా మంది ఫోన్ చేసి మంచి సినిమా బాగుంద‌ని అంటున్నారు. ప్ర‌థ‌మార్థం అద్భుతంగా చెబుతున్నారు. ద్వితీయార్థంలో కొన్ని లోపాలున్నాయి అంటున్నారు. వాటిని స‌రిదిద్దుకుంటూ ముందుకు సాగ‌డ‌మే నా ప‌ని. మంచి సినిమాతో మ‌ళ్లీ మీ ముందుకు వ‌స్తాను. ఈ సినిమాను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ అని అన్నారు.

More News

తండ్రైన మెగాఅల్లుడు

మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు క‌ల్యాణ్‌దేవ్‌, శ్రీజ దంప‌తుల‌కు నేడు ఆడ‌పిల్ల పుట్టింది. ఈ విష‌యాన్ని క‌ల్యాణ్‌దేవ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు.

'నేను లేను' ట్రైలర్ విడుదల

ఓ.య‌స్‌.యం విజన్ - దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `నేను లేను`. `లాస్ట్ ఇన్ లవ్` అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరో. ఈ చిత్రం ట్రైలర్ ని చిత్రం యూనిట్ విడుదల చేశారు .

పూరి, రామ్ సినిమా ప్ర‌క‌టన‌

డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. రామ్‌తో పూరి సినిమా ఉంటుందని వార్త‌లు విన‌ప‌డుతున్న నేప‌థ్యంలో నేడు పూరి అధికారికంగా సినిమా గురించి ప్ర‌క‌ట‌న చేశారు.

'ఫ‌ల‌క్‌నుమా దాస్' మెష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

వినూత్న‌మైన కాన్సెప్ట్ తో స‌క్స‌స్ లు సాధించిన వెళ్ళిపోమాకే, ఈ న‌గ‌రానికేమైంది లాంటి చిత్రాల్లో న‌టించిన విశ్వ‌క్‌సేన్ హీరోగా, స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో క‌రాటేరాజు గారు నిర్మాత‌గా, వన్‌మాయే క్రియేష‌న్స్

'య‌న్‌.టి.ఆర్‌'లో పాత్ర‌ధారులు

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ సినిమా రంగంలో అగ్ర క‌థానాయ‌కుడిగా రాణించారు. అక్క‌డి నుండి రాజ‌కీయ రంగంలో అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎనిమిది నెల‌ల్లోనే..