నా సినిమా అని గర్వంగా చెప్పుకునేలా ఉంది: శర్వానంద్
Send us your feedback to audioarticles@vaarta.com
శర్వానంద్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పడి పడి లేచె మనసు. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర బృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది.
నటుడు శత్రు మాట్లాడుతూ మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాత సుధాకర్ చెరుకూరి, దర్శకుడు హాను రాఘవపూడికి కృతజ్ఞతలు. సినిమా చూసినప్పుడు శర్వానంద్ పోషించిన సూర్య పాత్రే కనిపించింది. ఆయన నటించిన కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు చూస్తుంటే నాకు కన్నీళ్లొచ్చాయి. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలతో పోలిస్తే ఈ సినిమాలో క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కృష్ణగాడి వీర ప్రేమగాథతో పాటు చాలా సినిమాల్లో సీరియస్ పాత్రలు చేశాను. ఇలాంటి క్యారెక్టర్స్ తర్వాత డిఫరెంట్‌గా ఓ కామెడీ పాత్ర చేయడం ఆనందంగా ఉంది. నటులను వైవిధ్యతంగా చూపించే దర్శకులు అరుదుగా ఉంటారు. హను రాఘవపూడి నన్ను కొత్తగా ఈ సినిమాలో చూపించారు అని తెలిపారు.
కల్పిక మాట్లాడుతూ బ్యూటిఫుల్ విజువల్స్, సెన్సిబుల్ సీన్స్‌తో కూడిన సినిమాలు తక్కువగా వస్తాయి. అలాంటి సినిమాల జాబితాలో పడి పడి లేచె మనసు టాప్‌గా నిలుస్తుంది. మ్యూజికల్‌గా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సూర్య, వైశాలి కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. ఇందులో శాలిని అనే డాక్టర్ పాత్ర చేశాను. తొలి ప్రయత్నంలోనే నిర్మాత సుధాకర్ పెద్ద విజయాన్ని అందుకున్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని సక్సెస్‌లు అందుకోవాలి. కొత్తవాళ్లను ప్రోత్సహిస్తూ మంచి సినిమాలు తీయాలి అని చెప్పింది.
నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ సినిమాను అందరూ చక్కగా ఆదరిస్తున్నారు అని తెలిపారు.
శర్వానంద్ మాట్లాడుతూ సినిమా ఆంగీకరించే ముందు ఓ గుర్తుండిపోయే మంచి సినిమా అవుతుందని నమ్మాను. ఇప్పుడు అదే నమ్మకంతో ఉన్నాం. ఆల్బమ్‌లో పడి పడి లేచే మనసు నా సినిమా అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది. చాలా మంది ఫోన్ చేసి మంచి సినిమా బాగుందని అంటున్నారు. ప్రథమార్థం అద్భుతంగా చెబుతున్నారు. ద్వితీయార్థంలో కొన్ని లోపాలున్నాయి అంటున్నారు. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగడమే నా పని. మంచి సినిమాతో మళ్లీ మీ ముందుకు వస్తాను. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com