టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో అలరిస్తోన్న ‘‘ఒకే ఒక్క జీవితం’’ టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరస పెట్టి మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూనే ఉన్నాడు యంగ్ హీరో శర్వానంద్. కొన్నేళ్లుగా ఈయనకు సరైన విజయం దక్కలేదు. ఈ ఏడాది ఇప్పటికే శ్రీకారం సినిమాతో ఆకట్టుకున్నాడు శర్వా... దీనికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి తప్పించి రివార్డులైతే రాలేదు. తర్వాత వచ్చిన మల్టీస్టారర్ చిత్రం మహాసముద్రం కూడా అంచనాలు అందుకోలేకపోయింది.
అయినప్పటికీ నిరాశ చెందకుండా ఇప్పుడు ‘‘ఒకే ఒక జీవితం’’ అంటూ కొత్త సంవత్సరంలో పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు శర్వానంద్. ఇది ఆయన కెరీర్‌లో 30వ సినిమా కావడం గమనార్హం. కొత్త దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో ఒక వైపు పచ్చదనం, పోస్టాఫీసు, లేఖ, మ్యూజిక్ క్యాసెట్, గాలిపటాలు మొదలైనవి చూపించారు. ఇంకొక వైపు కర్మాగారాలు, సెల్ టవర్, మొబైల్, మ్యూజిక్ సిస్టమ్, ఫ్లైట్‌ని చూపించారు.
తాజాగా చిత్ర యూనిట్ బుధవారం టీజర్ విడుదల చేసింది . ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో.. టైమ్ మిషన్ కథతో తెరకెక్కుతుంది. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. టీజర్ లో శర్వానంద్‌తో పాటు అతడి స్నేహితులు ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ముగ్గురూ నాజర్ తయారు చేసిన టైం మెషిన్ లో గతంలోకి వెళతారు. నేను చెప్పబోయే విషయానికి మీరంతా ఆశ్చర్యపోతారు, నమ్మకపోవచ్చు కూడా.. కానీ నమ్మి తీరాల్సిందే' అంటూ నాజర్ చెబుతున్న డైలాగులు ఆసక్తికరంగా వున్నాయి. అలాగే తల్లికొడుకుల మధ్య అనుబంధాన్ని కూడా చూపించారు. అక్కినేని అమల కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు జేక్స్ బీజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో వున్న ఒకే ఒకే జీవితాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com