14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు నోటీసులు.. శర్వానంద్ కోపానికి కారణం అదేనా?

  • IndiaGlitz, [Saturday,May 29 2021]

యంగ్ హీరో శర్వానంద్ నటనా ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ముఖకవళికలతోనే అన్ని భావాలని పలికించగల నటుడు శర్వానంద్. కమర్షియల్ సక్సెస్ విషయంలో శర్వానంద్ ఒక అడుగు వెనుకబడే ఉన్నప్పటికీ అతడి కెరీర్ డీసెంట్ గా నే సాగుతోంది.

ఈ ఏడాది శర్వానంద్ శ్రీకారం చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ఆ చిత్రం విషయంలో ఓ వివాదం రాజుకుంది అంటూ టాలీవుడ్ లో బలమైన ప్రచారం జరుగుతోంది. శ్రీకారం చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. డెబ్యూ దర్శకుడు కిషోర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఇదీ చదవండి: బోల్డ్ సీనా.. అయితే ముందే క్లారిటీ ఇవ్వాలి

సినిమాకి ముందుగా తన రెమ్యునరేషన్ 6 కోట్లుగా నిర్మాతలతో శర్వానంద్ కు ఒప్పందం జరిగింది. కానీ విడుదల తర్వాత ఇస్తామని చెప్పి నిర్మాతలు రూ. 2 కోట్లు పెండింగ్ పెట్టారట. సినిమా విడుదలై చాలా రోజులు గడుస్తోంది. శర్వానంద్ తన పెండింగ్ క్లియర్ చేయమని ఇప్పటికే చాలా సార్లు నిర్మాతలని రిక్వస్ట్ చేశారట. కానీ ప్రొడ్యూసర్స్ నుంచి స్పందన రాకపోవడంతో శర్వానంద్ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.

దీనితో శర్వా నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దీనిపై నిర్మాతలు స్పందించాల్సి ఉంది. శర్వానంద్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే నటుడు. దీనితో ఈ వివాదం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

మార్చ్ 11న విడుదలైన శ్రీకారం చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. వ్యవసారం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశంసలు కూడా దక్కాయి. కానీ వసూళ్ల పరంగా ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది.

More News

ఏపీలో కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం

ఏపీలో కరోనాకు తొలిసారిగా మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం చేశారు. విజయవాడ ఆయుష్ హాస్పటల్‌లో కరోనా చికిత్సలో భాగంగా తొలిసారిగా ఈ ప్రయోగం నిర్వహించారు.

లెగ్ పీస్ రాలేదంటూ కేటీఆర్‌కు ట్వీట్.. స్పందించాల్సిందేనన్న అసదుద్దీన్..

మంత్రి కేటీఆర్‌కు రోజుకు ఎన్నో విజ్ఞప్తులు సోషల్ మీడియా వేదికగా వెళుతుంటాయి. అప్పుడప్పుడు అభిమానులు ఆయనకు పలు సూచనలు కూడా చేస్తుంటారు.

సుక్కు కథ నిఖిల్ ని కూడా మార్చేసిందే!

టాలీవుడ్ లో ట్యాలెంట్ ఉన్న యంగ్ హీరోల్లో నిఖిల్ ఒకడు. చూడడానికి లవర్ బాయ్ లా కనిపిస్తాడు కానీ మనోడు చేసే ప్రతి చిత్రం విభిన్నంగా ఉంటుంది.

కౌశల్ భార్యకు ఏమైంది.. ఆందోళన కలిగించేలా పోస్ట్ !

బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు విజేత కౌశల్ మందా. బిగ్ బాస్ ముందు వరకు కౌశల్ ఒక సాధారణ నటుడు, మోడల్ మాత్రమే. కానీ బిగ్ బాస్ షో తర్వాత కౌశల్ ఓ హీరోలా మారిపోయాడు.

బోల్డ్ సీనా.. అయితే ముందే క్లారిటీ ఇవ్వాలి

బోల్డ్ కంటెంట్, అడల్ట్ కామెడీ ఉండే చిత్రాలు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. ఈ చిత్రాల్లో ఇంటిమేట్ రొమాంటిక్ సీన్లు, శృంగార భరిత సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఎమోషనల్ ప్రేమ కథలు కూడా ఉంటాయి.