శర్వానంద్ నెక్ట్స్మూవీగా 'మహా సముద్రం'
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది 'జాను'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ కథానాయకుడు శర్వానంద్‌కు నిరాశే మిగిలింది. ఆ వెంటనే కరోనా వైరస్ ఫ్రభావం ఎక్కువ కావడంతో శర్వానంద్ లేటెస్ట్ మూవీ 'శ్రీకారం' చిత్రీకరణ ఆగిపోయింది. తర్వాత శర్వానంద్ ఏ సినిమా చేయబోతున్నాడనే దానిపై చాలా వార్తలు నెట్టింట హల్ చల్ చేయడం ప్రారంభించాయి. ఇలా శర్వానంద్ చేయబోయే తదుపరి చిత్రాల లిస్టులో అజయ్ భూపతి దర్శకత్వంలో చేయాల్సిన 'మహా సముద్రం' కూడా ఉంది. కానీ శర్వానంద్ ఎట్టకేలకు ఈ సినిమాపై స్పందించారు. శర్వానంద్, అజయ్ భూపతి కాంబినేషన్లో తెరకెక్కబోయే 'మహా సముద్రం'కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అనీల్ సుంకర నిర్మించబోయే ఈ చిత్రంలో శర్వానంద్ ఓ ఇన్టెన్స్ ఉన్న పాత్రను పోషించబోతున్నారట. గమ్యం, ప్రస్థానం తరహాలో శర్వానంద్ ఈ చిత్రంలో కనిపిస్తారట. ఈ సినిమాలో శర్వానంద్‌తోపాటు సిద్ధార్థ్ కూడా హీరోగా నటించే అవకాశాలున్నాయి. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను కూడా త్వరలోనే ప్రకటిస్తారట మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com