శర్వా కొత్త సినిమా టైటిల్
Send us your feedback to audioarticles@vaarta.com
`మహానుభావుడు`తో గత సెప్టెంబర్‌లో సక్సెస్‌ను ఖాతాలో మరో విజయాన్ని వేసుకున్నారు యువ కథానాయకుడు శర్వానంద్. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు శర్వానంద్. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంతో పాటే మరో సినిమా చేసేందుకు శర్వా ప్లాన్ చేస్తున్నాడు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాధ, లై చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. వినపడుతున్న వార్తలు ప్రకారం ఈ సినిమాకు `పడి పడి లేచేనె మనసు` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో శర్వానంద్‌తో సాయిపల్లవిని హీరోయిన్గా నటిస్తుంది. `ఫిదా`తో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి.. ప్రస్తుతం నేచురల్ స్టార్ నానికి జోడీగా ఎం.సి.ఎ చేసి సక్సెస్ సాధించింది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం `కణం`లోనూ నాగశౌర్యకి జోడీగా నటిస్తోంది. ఇందులో 4 ఏళ్ల పాపకి తల్లి పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. అలాగే ధనుష్ హీరోగా రూపొందుతున్న ద్విభాషా చిత్రంలోనూ సాయి పల్లవి కథానాయికగా ఎంపికైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments