శర్వా సినిమా ఎప్పుడంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
`రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు` ఇలా వరుస విజయాలను సాధించిన హీరో శర్వానంద్. ఇప్పుడు శర్వానంద్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. `స్వామిరారా`తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సుధీర్ వర్మ తర్వాత చైతన్యతో చేసిన `దోచెయ్`తో అపజయాన్ని మూటగట్టుకున్నాడు. నిఖిల్ `కేశవ`తో హిట్ అందుకున్నాడు.
ఇప్పుడు శర్వానంద్, సుధీర్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో శర్వానంద్ `నాయకుడు` సినిమాలో కమల్ హాసన్ వయసు మళ్లిన పాత్రలో నటించిన విధంగానే శర్వానంద్ వయసు మళ్లిన పాత్రలో నటిస్తున్నాడట. గ్యాంగ్‌స్టర్ పాత్రలో శర్వానంద్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని జూలై 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com