ఈ నెల 6 నుంచి శర్వానంద్ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్‌ను అందంగా తీర్చిదిద్దుకుంటున్న యువ కథానాయకులలో శర్వానంద్ ఒకరు. అలాగే.. ‘స్వామిరారా’, ‘కేశవ’ వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలను చూరగొన్నారు దర్శకుడు సుధీర్ వర్మ. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతోంది. ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకుడు సుధీర్ వర్మ మాఫియా నేపథ్యంలో ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు.
ఈ మూవీలో శర్వా మాఫియా డాన్ అవతారం ఎత్తనున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ చిత్రం విశాఖపట్నంలో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకోనుందని తెలిసింది. ఆ తర్వాత జరగబోయే షెడ్యూల్స్‌ను కాకినాడ, హైదరాబాద్‌లలో ప్లాన్ చేసుకున్నారు. శర్వా కెరీర్లో రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. శర్వా కోసం ఇంత భారీ బడ్జెట్లో సినిమాను తెరకెక్కిస్తున్నారంటే.. సుధీర్ వర్మ మళ్ళీ మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని అంతా నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం శర్వా, సాయిపల్లవి జంటగా.. హను రాఘవపూడి డైరెక్షన్లో ‘పడి పడి లేచె మనసు’ రూపొందుతున్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com