Sharwanand: శర్వానంద్‌కి యాక్సిడెంట్.. స్పందించిన శర్వా టీమ్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు శనివారం అర్రాత్రి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని ఓ జంక్షన్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో శర్వానంద్ గాయపడ్డారని ఆసుపత్రికి తరలించారని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై శర్వానంద్ టీమ్ స్పందించింది. ఆయనతో పాటు కారులో వున్న వారెవరికి ఏం కాలేదని, అందరూ క్షేమంగానే వున్నారని..కారుకి చిన్న గీతల మాత్రం పడ్డాయని పేర్కొంది. దీంతో శర్వానంద్ అభిమానులు , సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు.
జూన్ 3న రాజస్థాన్‌లో శర్వానంద్ వివాహం:
మరోవైపు .. శర్వానంద్ జూన్ 3న రక్షితారెడ్డిని వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం రాజస్థాన్‌లో జరగనుంది. ఈ ఏడాది జనవరి 26న విరి నిశ్చితార్ధం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ జరిగి చాలా కాలమే అయినా పెళ్లి తేదీ ప్రకటించకపోవడంతో మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. దీంతో వీటికి చెక్ పెడుతూ తమ వివాహ తేదీని, వేదికను ప్రకటించారు శర్వానంద్ . జూన్ 3న రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్‌లో తమ వివాహం జరుగుతుందని తెలిపారు. ఇక జూన్ 2న మెహందీ ఫంక్షన్, అదే రోజు ఉదయం శర్వానంద్‌ను పెళ్లి కొడుకును చేస్తారు.
ఎవరీ రక్షితా రెడ్డి:
కాగా.. రక్షితారెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వీరిది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ. రక్షిత తండ్రి ఏపీ హైకోర్ట్ న్యాయవాది కాగా.. ఆమె తాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాజీ మంత్రి, టీడీపీలో సీనియర్ నేత. ఇటీవలే ఆయన అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన గతేడాది ఒకే ఒక జీవితం చిత్రంతో మంచి హిట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments