శర్వా 'మహానుభావుడు'
Send us your feedback to audioarticles@vaarta.com
రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్‌రాజా, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రాలతో సక్సెస్ మీదున్న శర్వానంద్ ఇప్పుడు దిల్‌రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో` శతమానం భవతి` చిత్రంలో నటించాడు. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. శర్వానంద్ తదుపరి చిత్రాన్ని మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
భలే భలే మగాడివోయ్ చిత్రంలో నానిని మతిమరపు యువకుడిగా చూపించిన మారుతి శర్వానంద్‌ను ఈ చిత్రంలో నేటి ట్రెండ్‌ను యువతను ప్రతిబింబిస్తూ, బ్రాండ్‌లంటే మోజు పడే యువకుడిగా చూపిస్తున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహరీన్ నటింస్తుందని సమాచారం. ఈ సినిమాకు మహానుభావుడు అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments