వెంకీ సినిమాలో శర్వానంద్..?
Send us your feedback to audioarticles@vaarta.com
మన సినిమాల్లో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేయడం కామన్‌గా కనిపించే విషయమే. ఇప్పుడు అలాగే ఓ స్టార్ హీరో చేయాల్సిన సినిమాలో ఓ యువ కథానాయకుడు నటించబోతున్నాడని వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ స్టార్ హీరో వెంకటేశ్ కాగా.. యంగ్ హీరో శర్వానంద్. వివరాల్లోకెళ్తే.. ఈ ఏడాది ‘జాను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శర్వానంద్. షూటింగ్స్ విషయానికి వస్తే ఈయన ‘శ్రీకారం’ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. దీని తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘మహాసముద్రం’ సినిమాలో శర్వా నటించాల్సి ఉంది. దీంతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఈ హీరో ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కిషోర్ తిరుమల గతంలో వెంకటేశ్‌తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఎందుకనో ట్రాక్ ఎక్కలేదు.
లేటెస్ట్ సమాచారం మేరకు ఇదే కథతో కిషోర్ తిరుమల.. హీరో శర్వానంద్‌ను కలిశాడట. శర్వానంద్‌కు కథ బాగా నచ్చిందట. అయితే అది ఫస్టాఫ్ మాత్రమే నచ్చింది. సెకండాఫ్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి మళ్లీ కథ వినిపించమని కిషోర్ తిరుమలకు శర్వా చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు శర్వానంద్ చెప్పిన రీతిలో మార్పులు, చేర్పులు చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ సినిమా 2021 ద్వితీయార్థంలోనే మొదలయ్యే అవకాశాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com