పీరియాడికల్ లవ్‌స్టోరీలో శర్వానంద్
Send us your feedback to audioarticles@vaarta.com
జయాపజయాలు పట్టించుకోకుండా స్క్రిప్ట్ నచ్చితే సినిమాలు చేసే హీరోల్లో శర్వానంద్ ఒకరు. అందుకు ఉదాహరణ `లై` సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే హీరో శర్వానంద్ దర్శకుడిపై నమ్మకంతో సినిమా చేయడానికి సిద్ధమై.. `పడిపడిలేచెమనసు` సినిమా చేశాడు. ఈ సినిమాకు డిజాస్టర్ అయ్యింది. నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇప్పుడు శర్వానంద్ అలాంటి రిస్కీ స్టెప్‌నే తీసుకున్నాడు. డైరెక్టర్ చందు మొండేటితో శర్వానంద్ సినిమా చేయబోతున్నాడు. గత ఏడాది సవ్యసాచి సినిమా చేసిన చందు మొండేటిని విజయం వెక్కిరించింది. దీంతో ఢీలా పడ్డ ఆ దర్శకుడు రీసెంట్‌గా శర్వానంద్‌ను కలిసి ఓ కథ వినిపించాడట. శర్వాకు కథ నచ్చింది. నటించడానికి ఓకే చెప్పేశాడు.
అయితే ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం సినిమాతో బిజీగా ఉన్నాడు. మరో పక్క చందు మొండేటి కూడా నిఖిల్‌తో కార్తికేయ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాతే శర్వానంద్‌తో సినిమా ఉంటుందని అంటున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా పీరియాడికల్ లవ్‌స్టోరీ అని వార్తలు వినపడుతన్నాయి. 1910-2121 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తారని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com