సూర్య సినిమాలో రష్మిక ప్లేస్ పట్టేసిన శర్వానంద్ హీరోయిన్..!
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సూర్యకు గత ఏడాది బాగానే కలిసొచ్చింది. ఎందుకంటే చాలా రోజులుగా ఓ మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సూర్యకు 2020లో విడుదలైన ‘ఆకాశం నీహద్దురా’ చాలా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకులు ప్రశంసలను కూడా ఈ సినిమా దక్కించుకుంది. కాగా తదుపరి సూర్య కిట్టిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఓకటి చిత్రంగా వెట్రిమారన్ దర్శకత్వంలో చేయబోతున్న ‘వడివాసల్’. కాగా సూర్య 40వ చిత్రం పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ రెండు సినిమాల్లో పాండిరాజ్ సినిమానే ముందుగా.. అంటే ఫిబ్రవరి నుండి సెట్స్‌పైకి వెళుతుంది. ఇప్పుడు జ్ఞానవేల్ అనే డైరెక్టర్ రూపొందిస్తోన్న సినిమాలో సూర్య ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పాండిరాజ్ సూర్యతో సినిమాను తెరకెక్కిస్తాడు. ఇది పూర్తయిన తర్వాతే వెట్రిమారన్ సినిమా ఉంటుందని టాక్.
లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ కన్‌ఫర్మ్ అయ్యింది. ప్రియాంక అరుల్ మోహన్ తెలుగులో నాని..గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించింది. ఇప్పుడు శర్వానంద్ శ్రీకారం సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే తమిళంలోనూ శివ కార్తికేయన్ డాక్టర్ సినిమాలోనూ నటించింది. ఇప్పుడు సూర్య, పాండిరాజ్ సినిమాలో నటిస్తుంది. ముందుగా ఈ సినిమా రష్మిక మందన్న హీరోయిన్‌గా తీసుకుంటారని వార్తలు వినిపించినప్పటికీ చివరకు ప్రియాంక అరుల్ మోహన్‌కే అవకాశం దక్కింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments