సోదరి పాత్రలో శర్వానంద్ హీరోయిన్...

  • IndiaGlitz, [Monday,February 08 2016]

డ‌బ్బింగ్ చిత్రం జ‌ర్నీ సినిమా తెలుగులో పెద్ద స‌క్సెస్ అయింది. ఈ సినిమాలో శ‌ర్వానంద్‌తో న‌టించిన అనన్య తెలుగు ప్రేక్ష‌కులకు గుర్తుండే ఉంటుంది. త‌ర్వాత తెలుగు చిత్రాల్లో అన‌న్య కనిపించ‌లేదు. పెళ్ళి చేసుకుంది. పెళ్ళి త‌ర్వాత సినిమాల్లో న‌టించ‌దేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు అన‌న్య సినిమాల్లో న‌టిస్తుంది. తెలుగులో ఇప్పుడు త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టిస్తుంది. త్రివిక్ర‌మ్‌, నితిన్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న అ..ఆ చిత్రంలో నితిన్ సోద‌రి పాత్ర‌లో అన‌న్య క‌నిపించ‌నుంద‌ట‌. ఈమెకు జోడిగా అవ‌స‌రాల శ్రీనివాస్ క‌న‌పిస్తాడు. ఇప్ప‌టి వ‌ర‌కు డైరెక్ట్ తెలుగులో అమాయ‌కుడు అనే చిత్రంలో న‌టించింది. త‌ర్వాత ఇంటింటా అన్న‌మ‌య్య‌లో న‌టించినా ఆ సినిమా విడుద‌ల కాలేదు. ఈ రెండు చిత్రాలు త‌ర్వాత అనన్య న‌టిస్తున్న తెలుగు చిత్ర‌మిదే.