మెగా హీరో క‌థ‌తో శ‌ర్వా సినిమా

  • IndiaGlitz, [Monday,June 01 2020]

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ చేతిలో ఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ఏడాది జానుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన శ‌ర్వానంద్‌కు నిరాశ త‌ప్ప‌లేదు. ఇప్పుడు శ‌ర్వానంద్ శ్రీకారం సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. ఇది పూర్తి కాగానే అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హాస‌ముద్రం సినిమా చేయాల్సి ఉంది. అలాగే కిషోర్ తిరుమ‌ల సినిమా కూడా శ‌ర్వానంద్ చేయాల్సి ఉంది. మూడు ప్రాజెక్ట్స్ ఉండ‌గా ఇప్పుడు మ‌రో ప్రాజెక్ట్ శ‌ర్వా చేతికి వెళ్లేలా ఉంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

వివ‌రాల మేర‌కు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో యువీ క్రియేష‌న్స్ ఓ సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకుని క‌థ‌ను సిద్ధం చేసింది. శ్రీరామ్ రెడ్డి క‌థ‌ను త‌యారు చేశారు. స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా పూర్త‌య్యింది. అయితే రామ్‌చ‌ర‌ణ్ మాత్రం ఈ ప్రాజెక్ట్ చేయ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. దీంతో యువీ క్రియేష‌న్స్ ఈ క‌థ‌ను శ‌ర్వానంద్‌తో చేయాల‌నుకుంటున్నార‌ట‌. అయితే శ‌ర్వానంద్ డేట్స్ ఎలా అడ్జ‌స్ట్ చేస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. శ‌ర్వానంద్‌, కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో సినిమా ప్రారంభం కావ‌డానికి ముందు యువీ క్రియేషన్స్ బ్యాన‌ర్‌లో శ‌ర్వా సినిమా ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

విదేశీ షెడ్యూల్ వ‌ద్ద‌న్న మ‌హేశ్‌!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. మ‌హేశ్ 27వ చిత్రంగా తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రంలో 40 శాతం చిత్రీక‌ర‌ణను

కొత్త ఆలోచ‌న‌లో బ‌న్నీ అండ్ టీమ్

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. పాన్ ఇండియా మూవీగా సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్న స‌మ‌యంలో క‌రోనా ప్ర‌భావంతో లాక్‌డౌన్ విధించారు.

'ల‌వ్,లైఫ్ అండ్ ప‌కోడి' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

క‌ల‌ర్ ఆఫ్ మై  ఇంక్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై మ‌ధురా శ్రీధ‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌ణ లో రూపొందిన చిత్రం "ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి" జ‌యంత్ గాలి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో

క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్‌

ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ ట్రెండ్ కొన‌సాగుతోంది. రాజ‌కీయ‌, సినీ, క్రీడ‌లు స‌హా ప‌లు రంగాల్లో అత్యున్న‌త సేవ‌లు అందించిన ప‌లువురి జీవిత చ‌రిత్ర‌లు వెండితెర‌పై ఆవిష్కత‌మ‌వుతున్నాయి.

నాగబాబు.. నువ్వెంత.. నీ బతుకెంత : డైరెక్టర్

టాలీవుడ్‌ సీనియర్ హీరో నందమూరి బాలయ్యపై మెగాబ్రదర్ నాగబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు పెద్దలు ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా..