శర్వా స్కూబా డైవింగ్
- IndiaGlitz, [Friday,April 19 2019]
యువ కథానాయుకుడు శర్వానంద్ ఇప్పుడు తమిళ నుండి తెలుగులోకి రీమేక్ అవుతోన్న '96' రీవేుక్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నారు. పాత్ర కోసం శర్వానంద్ స్కూబా డైవింగ్ చేశాడట.
అండర్ వాటర్ క్రీడకు సంబంధించిన స్కూబా డైవింగ్ కోసం శర్వానంద్ ఓ రోజు శిక్షణ తీసుకున్నారట. రీసెంట్‌గా ఈ స్కూబా డైవింగ్ సన్నివేశాన్ని మారిషష్‌లో చిత్రీకరించారు.
దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు సి.ప్రేవ్‌ుకుమార్ దర్శకుడు. సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు తెలుగులో 'జాను' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేసేలా ప్లాన్స్ చేస్తున్నారు.