చివరి షెడ్యూల్ లో శర్వానంద్ - దిల్ రాజుల శతమానంభవతి

  • IndiaGlitz, [Tuesday,November 01 2016]

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి". అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం అవుతుంది. నవంబరు చివరి వరకు సాగే ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
సంక్రాంతి 2017 కి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
" శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ లో వచ్చిన బొమ్మరిల్లు చిత్రం తండ్రీ కొడుకుల మధ్య ఉండే సంబంధాన్ని అందం గా ప్రతిబింబించింది. ఇప్పుడు శతమానం భవతి తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. మా బ్యానర్ కి బొమ్మరిల్లు సినిమా ఎంత పేరు తెచ్చిపెట్టిందో, ఈ శతమానం భవతి చిత్రం అంతటి పేరు ను తెస్తుంది అని నమ్మకం ఉంది", అని దిల్ రాజు తెలిపారు.
హైదరాబాద్ మరియు గోదావరి జిల్లాల పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి దర్శకత్వం : సతీష్ వేగేశ్న , ఎడిటింగ్ మధు , సినిమాటోగ్రఫి సమీర్ రెడ్డి, సంగీతం మిక్కీ జె మేయర్, నిర్మాతలు : రాజు , శిరీష్

More News

దీపావళి కానుకగా 2,500 మంది పిల్లలకు గిఫ్ట్ బాక్స్ లు పంపిన సూపర్ స్టార్ మహేష్..!

సూపర్స్టార్ మహేష్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై టాప్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతుంది.

నవంబర్ 11న 'ఇంట్లో దెయ్యం..నాకేం భయం'

అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి,సీమటపాకాయ్ చిత్రాలు

సంక్రాంతి రేసు నుండి త‌ప్పుకున్న...?

వ‌చ్చే ఏడాది సంక్రాంతికి తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు సినిమా పండుగ ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబ‌ర్ 150 సినిమా సంక్రాంతికి విడుద‌ల కానుండ‌గా, మ‌రో వైపు నంద‌మూరి బాల‌కృష్ణ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి కూడా సంక్రాంతికి రావ‌డం ఖాయ‌మైంది.

మారుతితో జతకడుతున్న శర్వా...

రన్ రాజా రన్,ఎక్స్ ప్రెస్ రాజా,మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రాలతో సక్సెస్ మీదున్న శర్వానంద్

మల్టీస్టారర్ చేస్తున్న సుధీర్ దర్శకుడు

హీరో సుధీర్ బాబుతో భలే మంచి రోజు సినిమాను రూపొందించిన యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య