శర్వాకి చిరు సెంటిమెంట్ మరోసారి కలిసొచ్చేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటి తెలుగు హీరోలకి 90వ దశకంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి పాటలను రీమిక్స్ చేయడం పరిపాటైపోయింది. కాని వీళ్ళకి భిన్నంగా వెళ్తున్నారు యువ కథానాయకుడు శర్వానంద్. కాస్త వివరాల్లోకి వెళితే.. హను రాఘవపూడి డైరెక్షన్లో శర్వానంద్, సాయిపల్లవి జంటగా ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది ఈ చిత్రం. ఆర్మీ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ లవ్ స్టొరీకి పడి పడి లేచె మనసు` అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్ర బృందం.
1989లో చిరంజీవి నటించిన లంకేశ్వరుడు` చిత్రంలోని “పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు” పాట పల్లవిలోని లైన్‌నే ఇప్పుడు శర్వానంద్ చిత్రానికి టైటిల్‌గా వాడుకున్నారు. ఇలాగే.. గతంలో చిరంజీవి నటించిన రాక్షసుడు` సినిమాలోని “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” పాట పల్లవిలోని వాక్యాన్ని తన సినిమా టైటిల్ గా పెట్టుకున్నారు శర్వానంద్. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వాకు జంటగా నిత్యమీనన్ నటించారు. 2014లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని విజయం సాధించింది. ఈ నేపథ్యంలో.. చిరంజీవి పాటలోని పల్లవితో వస్తున్న టైటిల్.. శర్వానంద్‌కు రెండో సారి కూడా విజయాన్నందిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com