మహేష్ బాటలోనే శర్వానంద్ కూడా

  • IndiaGlitz, [Thursday,September 21 2017]

మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన ద్విభాషా చిత్రం స్పైడ‌ర్‌. స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొందిన స్పైడ‌ర్ ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకుంది. సింగిల్ క‌ట్ కూడా లేకుండా యు/ ఎ స‌ర్టిఫికేట్ పొందింది ఈ సినిమా. ద‌స‌రా కానుక‌గా ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది స్పైడ‌ర్‌. ఇదే ద‌స‌రా సంద‌ర్భంలో మ‌రో సినిమా కూడా రానుంది. అదే మ‌హానుభావుడు.

శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమా కూడా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకుంది. విశేష‌మేమిటంటే.. ఈ చిత్రం కూడా ఒక్క క‌ట్ కూడా లేకుండా యు/ఎ స‌ర్టిఫికేట్ పొందింది. ఈ నెల 29న విడుద‌ల కానున్న మ‌హానుభావుడు చిత్రానికి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందించారు. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

More News

మహేష్ విలన్ అడగకుండానే చేశాడంట

భారీ అంచనాల మధ్య ఈ నెల 27న రానుంది మహేష్ బాబు కొత్త చిత్రం స్పైడర్.

'సైరా' షూటింగ్ కి సిద్ధమౌతున్నాడు

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి.

తాత క్యారెక్ట‌ర్ చేయ‌డం లేద‌ట‌

మ‌హాన‌టి సావిత్రి జీవితం ఆధారంగా మ‌హాన‌టి సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్ర‌లో కేర‌ళ కుట్టి కీర్తి సురేష్ న‌టిస్తోంది.

ఎన్టీఆర్.. పాత్ర‌ల‌కే కాకుండా..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న కెరీర్‌లోనే తొలిసారిగా త్రిపాత్రాభిన‌యం చేసిన చిత్రం జైల‌వ‌కుశ.  ఈ సినిమాలో జై, ల‌వ‌కుమార్‌, కుశ అనే మూడు పాత్ర‌లు పోషించాడు తార‌క్‌.

సాయిప‌ల్ల‌వి అక్క‌డ కూడా..

ఫిదా చిత్రంతో తెలుగువారికి ప‌రిచ‌య‌మైన కేర‌ళ కుట్టి సాయి పల్ల‌వి. అంత‌కుముందు ప్రేమ‌మ్‌, క‌లి అనే మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టించిన‌ సాయిప‌ల్ల‌వికి ఫిదాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు వ‌చ్చింది.