సంక్రాంతికి వచ్చేస్తానంటున్న శర్వానంద్..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన సురభి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. యు.వి.క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వైవిధ్యంగా రోడ్ జర్నీ నేపథ్యంతో సాగే ఎక్స్ ప్రెస్ రాజా మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఎక్స్ ప్రెస్ రాజా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
సంక్రాంతి కానుకగా జనవరి 15న ఎక్స్ ప్రెస్ రాజా ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి నాన్నకు ప్రేమతో...డిక్టేటర్, సొగ్గాడే చిన్ని నాయనా...ఇలా పెద్ద సినిమాల రిలీజ్ ఉండడంతో ఎక్స్ ప్రెస్ రాజా సంక్రాంతికి రిలీజ్ డౌటే అనుకున్నారు. కానీ సినిమా పై ఉన్న నమ్మకంతో సంక్రాంతికి తప్పకుండా రిలీజ్ చేస్తామంటున్నారు చిత్ర నిర్మాతలు. మరి...చివరి వరకు ఇదే మాట పై నిలబడి రిలీజ్ చేస్తారో..? లేక వాయిదా వేస్తారో..? చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com