Ayyannapatrudu: సీఎం జగన్ నుంచి షర్మిలకు ప్రాణహాని ఉంది: అయ్యన్నపాత్రుడు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు ప్రాణహాని ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. "సీఎం జగన్ చాలా దుర్మార్గుడు. జగన్కు తల్లి, చెల్లి, బాబాయ్ అందరూ ఒక్కటే. అధికారం కోసం ఏమైనా చేస్తాడు. జగన్కు వ్యతిరేకంగా షర్మిల గట్టిగా మాట్లాడుతున్నారు. బాబాయిని చంపినట్లు షర్మిలను చంపుతారని నాకు అనుమానం ఉంది. షర్మిలకు వెంటనే సెక్యూరిటీని పెంచాలి. సొంత బాబాయిని చంపేశారు. అందుకే తమకు జగన్ మీద అనుమానం ఉంది" అన్నారు. అలాగే తనకు ప్రాణహాని ఉందని.. రివాల్వర్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేశానని అయ్యన్న చెప్పుకొచ్చారు.
ఇక వైసీపీ నేతలు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ బెదిరించి లాక్కుంటున్నారని విమర్శించారు. ఈ నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలు ఎందుకు మీకు ఓట్లేయాలి? భూములు దోచుకున్నందుకా? అని నిలదీశారు. మూడు నెలల తర్వాత అధికారంలోకి వస్తామని.. అందరి లెక్కలు తీస్తామని హెచ్చరించారు. లండన్, అమెరికాలో జగన్ దాక్కున్నా లాక్కొచ్చి దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
కాగా షర్మిల ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేతగా హోదాపై పోరాటాలు చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ వద్ద తాకట్టుపెట్టారని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో మీరు అభివృద్ధి చేసింది ఎక్కడా..? మీరు చెప్పిన రాజధాని ఎక్కడా..? మీరు కట్టిన పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడా..? మీరు నడుపుతున్న మెట్రో ఎక్కడా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వైఎస్సార్ కుటుంబం చీలింది అంటే జగన్ చేతులారా చేసుకున్నది అంటూ తెలిపారు.
ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మారిపోయారంటూ ఫైర్ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ లేరని.. వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి మాత్రమే ఉన్నారని మండిపడ్డారు. అటు షర్మిల విమర్శలపై వైసీపీ నేతలు మూకుమ్మడిగా మాటల దాడికి దిగారు. దీంతో వారి విమర్శలకు ఆమె కూడా ఘాటుగానే సమాధానమిస్తున్నారు. ఈ క్రమంలోనే షర్మిలకు ప్రాణహాని ఉందంటూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout