Sharmila:షర్మిల సంచలన నిర్ణయం.. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరం..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల వేళ వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సంచలనం నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ను ఓడించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని.. అందుకే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతిస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన అనంతరం తెలంగాణలో కూడా గ్రాఫ్ పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీని తాను ఎప్పుడూ వేరుగా చూడలేదని.. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని షర్మిల పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తన తండ్రి దివంగత వైఎస్సార్ కోరుకున్నారని ఆమె పేర్కొన్నారు. తాను కూడా అదే ఉద్దేశంతో ఉన్నానని షర్మిల వివరించారు ఇటీవల ఢిల్లీలో తాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసినప్పుడు తనను కుటుంబ సభ్యురాలిగా వారు చూశారని ఆమె తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పలువురిని ఎన్నికల బరిలో నిలపాలని తాను అనుకున్నానని చెప్పారు. తాను కూడా పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాననే పూర్తి నమ్మకం తనకు ఉందన్నారు.
కానీ పాలేరులో కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారని చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల్లో పొంగులేటి గెలుపు కోసం తాను ప్రచారం చేశానని చెప్పారు. తెలంగాణలో తన పాదయాత్ర సమయంలో పొంగులేటి మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి పొంగులేటిని ఓడించడం ఇష్టంలేక తాను పోటీ చేయడం లేదని తెలిపారు. కష్టమైనా తమ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవిష్యత్ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని.. ప్రజలు తనను క్షమించాలని కోరారు. షర్మిల నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com