Sharmila:షర్మిల సంచలన నిర్ణయం.. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరం..

  • IndiaGlitz, [Friday,November 03 2023]

తెలంగాణ ఎన్నికల వేళ వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల సంచలనం నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని.. అందుకే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీల్చి కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన అనంతరం తెలంగాణలో కూడా గ్రాఫ్ పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీని తాను ఎప్పుడూ వేరుగా చూడలేదని.. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని షర్మిల పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తన తండ్రి దివంగత వైఎస్సార్ కోరుకున్నారని ఆమె పేర్కొన్నారు. తాను కూడా అదే ఉద్దేశంతో ఉన్నానని షర్మిల వివరించారు ఇటీవల ఢిల్లీలో తాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసినప్పుడు తనను కుటుంబ సభ్యురాలిగా వారు చూశారని ఆమె తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పలువురిని ఎన్నికల బరిలో నిలపాలని తాను అనుకున్నానని చెప్పారు. తాను కూడా పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాననే పూర్తి నమ్మకం తనకు ఉందన్నారు.

కానీ పాలేరులో కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారని చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల్లో పొంగులేటి గెలుపు కోసం తాను ప్రచారం చేశానని చెప్పారు. తెలంగాణలో తన పాదయాత్ర సమయంలో పొంగులేటి మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి పొంగులేటిని ఓడించడం ఇష్టంలేక తాను పోటీ చేయడం లేదని తెలిపారు. కష్టమైనా తమ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవిష్యత్ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని.. ప్రజలు తనను క్షమించాలని కోరారు. షర్మిల నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

More News

బాలయ్య ఖాతాలో మరో రూ.100కోట్లు సినిమా.. దసరా విన్నర్‌గా 'భగవంత్ కేసరి'

నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది దసరా విన్నర్‌గా నిలిచారు. ఆయన నటించిన 'భగవంత్ కేసరి'(Bhagavanth Kesari) మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Chandrababu Babu:చంద్రబాబు వెంట డీఎస్పీలు పెట్టాలన్న సీఐడీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు

టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతులు విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెల్లడించింది.

రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తిట్ల పురాణం సోషల్ మీడియాలో వైరల్..

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితేకాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..

జీ5లో 50 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ రాబట్టిన 'ప్రేమ విమానం'

దేశ వ్యాప్తంగా వైవిధ్యమైన కంటెంట్‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను కోరుకునే ప్రేక్షకుల‌ను మెప్పిస్తోన్న వ‌న్ అండ్ ఓన్లీ ఓటీటీ జీ5. తాజాగా అక్టోబ‌ర్ 13 నుంచి 'ప్రేమ విమానం’

CM Jagan:సుప్రీంకోర్టులో ఏపీ సీఎం జగన్‌కు షాక్.. అక్రమాస్తుల కేసులో సీబీఐకి నోటీసులు..

ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి సుప్రంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ అక్రమాస్తుల కేసులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన