Sharmila: మీ 'నవరత్నాలు'కు మా 'నవసందేహాలు' ఇవే.. సీఎం జగన్కు షర్మిల ప్రశ్నలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓవైపు అన్ని పార్టీల అధ్యక్షులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ కూడా తాను మరోసారి ముఖ్యమంత్రి అయితే ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు ఇప్పుడు అందించే నగదును కూడా పెంచుతానని చెబుతున్నారు.
అయితే జగన్కు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం వరుసగా కౌంటర్ లేఖలు రాస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. మీరు చెబుతున్న నవరత్నాల్లో మాకు నవసందేహాలు ఉన్నాయంటూ నిలదీస్తున్నారు. ఇప్పటికే రెండు లేఖలు రాసిన షర్మిల.. తాజాగా మద్య నిషేధంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
తాజా లేఖలో ప్రశ్నలివే..
1. మీరు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ ఎక్కడ.?, పాక్షికంగా అయినా అమలు అవుతుందా.?
2. మూడు దశల్లో మద్య నిషేధం అన్నారు. నిషేధం అమలు చేశాకే మళ్లీ ఓటు అడుగుతా అన్నారు.? ఏమైంది.?
3. మద్యం అమ్మకాల్లో రూ.20 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు ఆదాయం పెంచుకున్నారు. అంటే అమ్మకాల్లో అభివృద్ధి చెందినట్లు కాదా.?
4. మద్యం ద్వారా ఆదాయం అంటే... ప్రజల రక్త మాంసాలు మీద వ్యాపారం అన్నారు. మీరు చేస్తున్నది ఏంటి.?
5. ఎక్కడా దొరకని బ్రాండ్లు, కనీ వినీ ఎరుగని బ్రాండ్లు ఇక్కడే అమ్ముతూ ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు.?
6. బెవరేజేస్ కార్పొరేషన్ ను చేయూత, ఆసరా, అమ్మఒడి అమలు బాధ్యత అప్పగించడాన్ని ఎలా సమర్ధిస్తారు.?
7. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.11 వేల కోట్ల రుణాలు ఎందుకు సేకరించాలని అనుకున్నారు.?
8. డ్రగ్స్ పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఎందుకు ఉంది.?
9. రాష్ట్రంలో 20.19 లక్షల మంది డ్రగ్స్ కు అలవాటు పడ్డారంటే మీ వైఫల్యం కాదా.?' అని లేఖలో ప్రశ్నించారు.
కాగా కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల కొన్ని రోజులుగా రాష్ట్రమంతా పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు పోలింగ్ సమయం దగ్గరపడటంతో కడప జిల్లాపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీతో అంటకాగుతున్న సీఎం జగన్.. వైఎస్సార్ వారసులు ఎలా అవుతారంటూ ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసు నిందితులను కాపాడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తు్న్నారు. న్యాయానికీ, నేరానికీ జరుగుతున్న ఈ ధర్మ పోరాటంలో వైఎస్సార్ బిడ్డగా తనకు అండగా నిలబడాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. దీంతో కడప ఎంపీ ఎన్నికల రాష్ట్రమంతా ఆసక్తికరంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com