Sharmila:కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. ఆహ్వానించిన షర్మిల..

  • IndiaGlitz, [Tuesday,March 19 2024]

ఎన్నికల షెడ్యూల్ వచ్చిన మూడు రోజుల్లోనే అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. నందికొట్కూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్‌ వైయస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున నందికొట్కూరు ఎమ్మెల్యే శ్రీ ఆర్థర్ గారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నందుకు ఆనందిస్తున్నాను, అయన అనుభవం, ప్రజాసేవ చేయాలనే తపన, కాంగ్రెస్ పార్టీకి కొత్త బలాన్ని అందిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చేరిక, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ, నమ్మకం, కొత్త రెక్కలతో, మరింత శక్తితో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పుంజుకుంటోంది అనే నిజాన్ని నిరూపిస్తోంది అని షర్మిల ట్వీట్ చేశారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్‌కు ఈసారి సీఎం జగన్ టికెట్ నిరాకరించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ఈసారి ఎలాగైనా పోటీ చేయాలని డిసైడ్ అయి టీడీపీలో చేరాలని భావించారు. కానీ అక్కడ తెలుగుదేశం అభ్యర్థి ఖాయం కావడంతో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. చివరకు హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో నందికొట్కూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్థర్ పోటీ చేయనున్నట్లు సమాచారం.

కాగా 2019 ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గమైన నందికొట్కూర్ నుంచి ఆర్థర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే నియోజకవర్గ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్ధార్ధరెడ్డికి, ఆర్థర్‌కు మూడేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోయింది. పార్టీ పెద్దలు సర్దిచెప్పాలని ప్రయత్నించినా ఇద్దరు నేతలు రాజీ పడలేదు. ఈ క్రమంలోనే బైరెడ్డి తనకు అనుకూలంగా ఉన్న దారాల సుధీర్‌కు టికెట్ వచ్చేలా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆర్థర్ ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ అభ్యర్థిని ఓడించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

More News

Rajamouli:మహేష్ చాలా అందగాడు.. త్వరలోనే మీకు పరిచయం చేస్తా: రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి తన సతీమణి రమాతో కలిసి జపాన్‌లో జరిగిన RRR ప్రత్యేక స్క్రీనింగ్‌కి హారయ్యారు.

Telangana Governor:తెలంగాణకు కొత్త గవర్నర్‌ నియామకం.. ఎవరంటే..?

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్ రాజన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.

Hanuman:ఓటీటీలోనూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసి 'హనుమాన్'.. జీ5 చరిత్రలోనే..

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా చిన్న సినిమాగా విడుదలైన 'హనుమాన్' చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని విధంగా సెన్సేషన్ చేసిన సంగతిత తెలిసిందే.

RS Praveen Kumar :బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. ఆహ్వానించిన కేసీఆర్..

బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి

Kavitha:లిక్కర్ స్కాంలో కవితదే కీలక పాత్ర.. ఈడీ సంచలన ప్రకటన..

ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) కీలక ప్రకటన విడుదల చేసింది.