Sharmila:ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో షర్మిల ధర్నా.. జాతీయ పార్టీల నేతలతో భేటీ..

  • IndiaGlitz, [Friday,February 02 2024]

ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ ఆ అంశం గురించి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన కనీసం స్పందించడమే మానేశారు. అయితే ఏపీసీసీ చీఫ్ అయిన వైయస్ షర్మిల మాత్రం ప్రత్యేకహోదాపై గళం ఎత్తుతున్నారు. జిల్లాల వారిగా కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో ఆమె హోదాను టీడీపీ, వైసీపీ గాలికొదిలేశాయని తీవ్ర విమర్శలు చేశారు. రెండు పార్టీలు బీజేపీకి బానిసలుగా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారంటూ ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా అధికార వైసీపీ.. ప్రత్యేక హోదాతో పాటు పోలవరం, వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీయడం లేదంటూ మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో ప్రత్యే హోదా అంశంపై కేంద్రంతో గట్టిగా పోరాడేందుకు షర్మిల పూనుకున్నారు. ఇందుకోసం ఢిల్లీ వేదికగా పోరాటానికి సిద్ధమయ్యారు. తన పోరాటానికి జాతీయ పార్టీల మద్దతు కూడగడుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అంశాన్ని, రాష్ట్ర పరిస్థితులను పవార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై ఎన్సీపీ తరపున పార్లమెంట్‌లో లేవనెత్తాలని విజ్ఞప్తిచేశారు.

అనంతరం డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను కూడా కలిశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం మద్దతు కోరారు. ఆయన ఇందుకు హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. అలాగే సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిని కూడా కలిసి మద్దతు కోరారు. షర్మిల వెంట కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, గిడుడు రుద్రరాజు, జేడీ శీలం, రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఉన్నారు. వీరితో పాటు మరికొంత మంది ఇండియా కూటమి నేతలతో షర్మిల భేటీ అయ్యారు.

ఈ క్రమంలోనే ఏపీ భవన్‌లో ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు షర్మిల దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలకు కాంగ్రెస్ జాతీయ నేతలు కూడా హాజరుకానున్నారు. మొత్తానికి మరుగునపడిన ప్రత్యేక హోదా అంశంతో రాష్ట్రంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తిరిగి బలంగా నిలబెట్టాలని షర్మిల పోరాటం చేస్తున్నారు.

More News

Chiranjeevi:'విశ్వంభర' షూటింగ్‌లో జాయిన్ అయిన చిరంజీవి.. మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్..

పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం 'బింబిసార' దర్శకుడు వశిష్ట దర్శత్వంలో

2047 నాటికి భారత్‌ అభివృద్ధే లక్ష్యం.. బడ్జెట్ విశేషాలు ఇవే..

2024-25 సంవత్సరానికి గాను మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ఆమె ప్రకటించారు.

సలహాదారులకు రూ.680కోట్లు.. ఒక్క సజ్జలకే రూ.140కోట్లు: నాదెండ్ల

ప్రభుత్వ సలహాదారుల కోసమే వైసీపీ ప్రభుత్వం రూ.680కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు

నాగోబా ఆశీస్సులతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన నేతలు

నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా నిలిచింది. నాగోబాను ఆదివాసీలు తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా భావిస్తారు.

పేద పిల్లలకు పెద్ద చదువులు చెప్పించేలా సీఎం జగన్ కార్యాచరణ

సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచే విద్యారంగంలో సంస్కరణలకు తెరలేపారు. ఇందులో భాగంగా నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చారు.