సాక్షికి షాక్ ఇచ్చిన షర్మిల..
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో నిర్వహించిన సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. నాటి సభలో కేసీఆర్ చెప్పిన కేజీ టు పీజీ విద్య ఏమైందని షర్మిల ప్రశ్నించారు. అలాగే ప్రైవేట్ రంగంలోనూ వైఎస్ 11 లక్షల ఉద్యోగాలు కల్పించారని, ఇప్పుడు యువతకు ఉద్యోగాలు లేవన్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని షర్మిల కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
గురువారం ఆమె తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కొలువు దీక్ష చేపట్టారు. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అడ్డుగా ఉన్న కెమేరాలను తొలగించమంటూ మీడియాకు సూచించిన షర్మిల... అక్కడే ఉన్న సాక్షి ఛానెల్‌కు మాత్రం షాక్ ఇచ్చారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘‘మీరట్లా చేస్తే ఎట్లమ్మా.. మేము దీక్ష చేస్తోంది మీకోసమా.. జనాల కోసమా? సహకరించండి ప్లీజ్.. మధ్యలో ఉన్న ఐదు కెమెరాలు తీసి కాస్త సైడ్ అయిపోండి. (అవి సాక్షి కెమెరాలని తెలుసుకుని) ఇక చాల్లే అమ్మా.. మీ కవరేజ్ చాల్లే.. ఎలాగూ మీ సాక్షి మా కవరేజ్ ఇవ్వదుగా’’ అంటూ షాకిచ్చారు. అక్కడే ఉన్న షర్మిల తల్లి విజయమ్మ నవ్వుతూ ఆమెను చేతితో తట్టారు.
ఇందిరా పార్క్ వద్ద కొలువు దీక్ష అనంతరం షర్మిల ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఆమె పాదయాత్రను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. అటు ఆమెకు మద్దతిచ్చేందుకు అభిమానులు సైతం భారీగా తరలివచ్చారు. దీంతో అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో షర్మిల స్పృహతప్పి పడిపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com