Sharmila: 'నవ సందేహాల' పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం జగన్‌కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 'నవ సందేహాల' పేరుతో మరో లేఖ రాశారు. బుధవారం ఎస్సీ, ఎస్టీల గురించి 9 ప్రశ్నలతో ఓ లేఖ రాయగా.. తాజా లేఖలో ఉద్యోగాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
లేఖలో ప్రశ్నలివే..
1. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. ఏమైంది.?
2. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎందుకు ఇవ్వలేదు.?
3. గ్రూప్ - 2 కింద ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు భర్తీ చేయలేదు?
4. 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఏం చేశారు.?
5. వర్శిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు.?
6. 23 వేలతో మెగా డీఎస్సీ అని 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు.?
7. నిరుద్యోగులు 7.7 శాతం పెరిగారంటే మీ వైఫల్యం కాదా.?
8. యువత ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారు.?
9. ప్రస్తుతం జాబ్ రావాలంటే మీ పాలన పోవాలి అని అంగీకరిస్తారా.?
కాగా ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కడప ఎంపీగా ఆమె పోటీ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా అవినాశ్ రెడ్డి బరిలో దిగారు. దీంతో అక్కడ పోరు నువ్వా నేనా రీతిలో ఉంది. వైఎస్ కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు ప్రత్యర్థులు తలపడటంతో రాష్ట్రమంతా ఆసక్తిగా మారింది. ముఖ్యంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు చుట్టూ కడప జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయి. మరి వైఎస్ కుటుంబం యుద్ధంలో ఎవరు పైచేయి సాధిస్తారో తెలియాలంటే జూన్ 4వరకు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments