సంఘం నుంచి తొలిగించిన విశాల్ పై శరత్ కుమార్ రియాక్షన్..!
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడులో నడిగర సంఘం ఎన్నికల సమయంలో ఏర్పడిన గొడవలు...ఎన్నికల తర్వాత సర్ధుకుంటాయి అనుకుంటే రోజురోజుకు పెరుగుతున్నాయే కానీ...తగ్గడం లేదు. తాజాగా నడిగర సంఘం జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ లో ఏక్రగీవ తీర్మానంతో అక్రమాలకు పాల్పడ్డారు అంటూ నడిగర సంఘం మాజీ ప్రెసిడెంట్ శరత్ కుమార్, మాజీ జనరల్ సెక్రటరీ రాధారవి, మాజీ ట్రెజరర్ వాగై చంద్రశేఖర్ లను శాశ్వతంగా తొలగించారు.
నడిగర సంఘం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై శరత్ కుమార్ స్పందిస్తూ...ఈ విషయం పై కోర్టును సంప్రదిస్తున్నాను. అందుచేత నా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నా శ్రేయోభిలాషలు అందరూ సైలెంట్ గా ఉండాలి అని కోరుతున్నాను. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అని తెలియచేసారు. మరి..కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో..? ఈ వివాదం ఎక్కడ వరకు వెళుతుందో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout