టాకీ పూర్తి చేసుకున్న శరణం గఛ్చామి
Saturday, April 9, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నవీన్ సంజయ్, తనిష్క్ తివారి జంటగా ప్రేమ్ రాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం శరణం గఛ్చామి. ఈ చిత్రాన్ని బొమ్మకు క్రియేషన్స్ బ్యానర్ పై బొమ్మకు మురళి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల టాకీ పూర్తి చేసుకుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
ఈ సందర్భంగా....
డైరెక్టర్ ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ...ప్రస్తుతం సమాజంలో రగులుతున్న ఒక సమస్యను తీసుకుని అన్నివ్యాపారాత్మక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. హీరో నవీన్ సంజయ్, హీరోయిన్ తనిష్క్ తివారి కొత్తవారైనా అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఈ చిత్రం వారికి తప్పకుండా బ్రేక్ ఇస్తుంది అన్నారు.
నిర్మాత బొమ్మకు మురళి మాట్లాడుతూ....మొదటిసారి నిర్మాణ రంగంలో ప్రవేశించాం. పక్కా ప్రణాళికతో టాకీ పార్ట్ పూర్తి చేసాం. ఈ చిత్రంలోని రెండు పాటలను గోవాలో చిత్రీకరించనున్నాం. ఈ సినిమా కోసం అంబేద్కర్ గీతాన్ని ఈ నెల 13న దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా విడుదల చేయనున్నాం. ఈ పాట సమాజంలోని ప్రతి ఒక్కరికి మేలుకొలుపుగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ వేసవిలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం అన్నారు.
రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాను. టి.కృష్ణ ఒరవడిలో ఇలాంటి చిత్రాలు రావలసిన అవసరం ఉంది. సమాజంలో విలువలు కరువవుతున్న దశలో ఇలాంటి చిత్రాలు దిక్సూచిలా పని చేస్తాయి. ఉన్నతమైన విలువలతో మంచి సందేశాన్ని ఇచ్చే ఈ చిత్రం ఘన విజయం సాధించి ఇలాంటి సినిమాలు తీసేవారికి ఊపిరి పోయాలి అన్నారు.
పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, సుబ్బరాయశర్మ, దేశపతి శ్రీనివాస్, ఫిష్ వెంకట్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రలో బి.సి నాయకుడు ఆర్.కృష్ణయ్య నటించారు. ఈ సినిమాకి సంగీతం రవికళ్యాణ్, కెమెరా కళ్యాణ్ సమి, పాటలు సుద్దాల అశోక్ తేజ, డాన్స్ ప్రకాష్ వి జోసఫ్, కో డైరెక్టర్ ప్రభాకర్, ప్రొడక్షన్ డిజైనర్ మహేష్ బొల్లారం, సందీప్, కథ - నిర్మాత బొమ్మకు మురళి, మాటలు - దర్శకత్వం ప్రేమ్ రాజ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments